Next CM JR NTR : నెక్స్ట్ సీఎం జూనియ‌ర్ ఎన్టీఆర్

ఒంగోలులో పోస్ట‌ర్స్ క‌ల‌క‌లం

Next CM JR NTR : తెలుగు సినిమా రంగంలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగి ఉన్న న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌కుండా త‌న కెరీర్ ను ప‌దిలంగా కాపాడుకుంటూ వ‌స్తున్నాడు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Next CM JR NTR Flexis

చంద్ర‌బోస్ రాసిన నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు ద‌క్కింది. దీనికి ఎంఎం కీర‌వాణి అందించారు. ఇక డైన‌మిక్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో జాహ్న‌వి క‌పూర్ తో జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అభిమానులు కోరుతున్నారు. ఆయ‌న మాత్రం సైలెంట్ గా ఉన్నారు. కేవ‌లం సినిమాలు మాత్ర‌మే చేస్తున్నాడు.

ఇదిలా ఉండ‌గా ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా స్వ‌యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ను క‌లుసుకున్నారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌మ్మ ఓటు బ్యాంకు కొల్ల‌గొట్టేందుకు దివంగ‌త ఎన్టీఆర్ కూతురు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని బీజేపీ స్టేట్ చీఫ్ గా నియ‌మించింది. తాజాగా ఒంగోలులో జూనియ‌ర్ ఎన్టీఆర్ సీఎం కావాలంటూ పోస్ట‌ర్లు(Next CM JR NTR) వెలిశాయి. టీడీపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.
Also Read : India Poster : ‘ఇండియా’ పోస్ట‌ర్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!