NIA Tailor Murder : టైలర్ దారుణ హత్యపై ఎన్ఐఏ విచారణ
ఉదయపూర్ లో అదనపు బలగాల మోహరింపు
NIA Tailor Murder : రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో దర్జీ (టైలర్ ) కన్హయ లాల్ హత్య(NIA Tailor Murder) కలకం రేపింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దుండగులు కెమెరాలో రికార్డ్ చేసిన దారుణ హత్యను తీవ్రవాద ఘటనగా పరిగణిస్తున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాజస్థాన్ అంతటా ఒక నెల రోజుల పాటు 144వ సెక్షన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. 600 మందికి పై అదనపు బలగాలను మోహరించారు.
ఎలాంటి సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వబోమంటూ స్పష్టం చేసింది సర్కార్. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే తాము ఇలా ప్రతీకారం తీర్చుకున్నామంటూ ఘటనకు పాల్పడిన గౌస్ మహ్మద్ , రియాజ్ అఖ్తరీలను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను కోరింది(NIA Tailor Murder). ఈ ఘటనలో ఏదైనా ఉగ్రవాద కోణం దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రపుల్ కుమార్ చెప్పారు.
ఈ ఇద్దరు కస్టమర్లుగా వచ్చారు. కన్హయ లాల్ దుకాణంలోకి ప్రవేశించారు. టైలర్ ను కత్తితో చంపేశారు. మొదట తల నరికి చంపేందుకు ప్రయత్నించారని కాని కుదరలేదని తెలిపారు.
మరో వీడియోలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా బెదిరించడం కలకలం రేపింది. కేంద్రం ఈ హత్యను ఉగ్రవాద ఘటనగా పరిగణిస్తోందని ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ బృందాన్ని ఉదయ్ పూర్ కు పంపినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read : ఏ మతం హింసను ప్రోత్సహించదు