Nirmala Sitharaman : మ‌నీ లాండ‌రింగ్ అత్యంత ప్ర‌మాదం

దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

Nirmala Sitharaman : భార‌త దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క్రిప్టో క‌రెన్సీ గురించి కామెంట్ చేయ‌డం విశేషం.

ప్ర‌స్తుత డిజిట‌ల్ ప్ర‌పంచంలో భార‌త దేశ ప‌నితీరును , గ‌త ద‌శాబ్దంలో డిజిట‌ల్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫ్రేమ్ వ‌ర్క్ ను రూపొందించేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాల గురించి ప్ర‌స్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి.

నిర్మ‌లా సీతారామ‌న్ అధికారిక ప‌ర్య‌ట‌న నిమిత్తం వాషింగ్ట‌న్ కు చేరుకున్నారు. అగ్ర‌గామి ఫిన్ టెక్ విప్ల‌వం మ‌ధ్య‌, క్రిప్టో క‌రెన్సీ అతి పెద్ద ప్ర‌మాదం మ‌నీ లాండ‌రింగ్ , టెర్ర‌ర్ కు ఫైనాన్సింగ్ కోసం దాని ఉప‌యోగం అని పేర్కొన్నారు.

అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి – ఐఎంఎఫ్ స్ప్రింగ్ మీట్ సంద‌ర్బంగా జ‌రిగిన సెమినార్ లో నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) పాల్గొని ప్ర‌సంగించారు. బోర్డు అంత‌టా అన్ని దేశాల‌కు అతి పెద్ద ప్ర‌మాదం మ‌నీలాండ‌రింగ్ అని హెచ్చ‌రించారు.

క‌రెన్సీ అంశం కూడా ప్ర‌ధాన‌మ‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఈ మ‌నీ లాండ‌రింగ్ వ‌ల్ల తీవ్ర‌వాదం పెచ్చ‌రిల్లుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నేరుగా నిధులు స‌మ‌కూర్చుతోందని ఆరోపించారు. సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి నియంత్ర‌ణ మాత్ర‌మే స‌మాధానం అని పేర్కొంటుంది.

ప్రపంచ బ్యాంక్ లో జీ 20 ఆర్థిక మంత్రుల స‌మావేశం, సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌ర్ మీటింగ్ లో పాల్గొనేందుకు అధికారిక ప‌ర్య‌ట‌న‌పై కేంద్ర మంత్రి చేరుకున్నారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌నీ ఎట్ ఎ క్రాస్ రోడ్ అనే అంశంపై ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ క్రిస్టాలినా జార్జివా హోస్ట్ చేశారు. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి పాల్గొన్నారు.

Also Read : కొత్త ఆర్మీ చీఫ్ గా మ‌నోజ్ పాండే

Leave A Reply

Your Email Id will not be published!