Nirmala Sitharaman : డెట్టాల్ తో మీ నోళ్లను కడుక్కోండి
కాంగ్రెస్ ఎంపీలకు నిర్మలమ్మ సూచన
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే నిర్మలమ్మకు కోపం తారా స్థాయికి చేరుకుంది. ఆమె కాంగ్రెస్ పార్టీ ఎంపీలను టార్గెట్ చేశారు. అవినీతి, అక్రమాల గురించి మాట్లాడే అర్హత, నైతిక హక్కు వారికి లేదని స్పష్టం చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న ఎంపీలు ముందు మీ మురికి పట్టిన నోళ్లను డెట్టాల్ తో శుభ్రం చేసుకోవాలని సలహా ఇచ్చారు నిర్మలా సీతారామన్. తమ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాతే దేశంలో అభివృద్ది అన్నది కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్నదని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా కార్యక్రమాలను అమలు చేశామన్నారు.
దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశంలో ఎక్కడా , ఎప్పుడూ లేనంత అవినీతి, అక్రమాలు , నేరాలు, ఘోరాలు చోటు చేసుకున్నాయని నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆరోపించారు.
వీటిని నిర్మూలించాలంటే కనీసం ఇంకా 100 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. అభివృద్దే ఎజెండాగా ముందుకు వెళుతున్నామని రాబోయే ఎన్నికల్లో ఎవరు ప్రజలను ఆదరిస్తారనేది తేలుతుందన్నారు.
ఆమె ప్రధానంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసినట్లు భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎం అశోక్ గెహ్లాట్ గత ఏడాది తయారు చేసిన బడ్జెట్ ను ఈ ఏడాది చదువుతున్నారని , ఇలా ఉంది మీ పార్టీ ఆధ్వర్యంలోని పాలన అంటూ మండిపడ్డారు విత్త మంత్రి. బీజేపీ నాయకురాలు వసుంధర రాజే తీవ్రంగా తప్పు పట్టారు సీఎం అశోక్ గెహ్లాట్ ను.
Also Read : కవిత్వం అంటే ఏమిటి – జగదీప్