Niti Aayog KCR : సీఎం కేసీఆర్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం

స్ప‌ష్టం చేసిన నీతి ఆయోగ్

Niti Aayog KCR : కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ పై దుమ్మెత్తి పోశారు సీఎం కేసీఆర్. మోదీ నేతృత్వంలో ఈనెల 8న ఢిల్లీలో జ‌రిగే నీతి ఆయోగ్ స‌మావేశానికి తాను రావ‌డం లేద‌ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేసీఆర్.

నీతి ఆయోగ్ లో ప‌స లేద‌ని, గ‌తంలో ఉన్న ప్లానింగ్ క‌మిష‌న్ బాగుండేద‌ని కితాబు ఇచ్చారు. ప్ర‌ధాన మంత్రికి భ‌జ‌నం చేయ‌డం త‌ప్ప నీతి ఆయోగ్(Niti Aayog KCR)  లో ఒరిగింది ఏమీ లేద‌న్నారు కేసీఆర్.

దానిని ఎవ‌రు అమ‌లు చేస్తున్నారో తెలియ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఆపై పాల్గొనే సీఎంల‌కు మాట్లాడే చాన్స్ లేకుండా పోతోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీఎంలు మాట్లాడ‌కుండా బెల్ కొట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు సీఎం కేసీఆర్. నీతి ఆయోగ్(Niti Aayog KCR) అనేది ప‌లికిమానిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

నీతి ఆయోగ్ వేస్ట్ అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది నీతి ఆయోగ్. సీఎంల‌తో 30 స‌మావేశాలు నిర్వ‌హించామ‌ని తెలిపింది.

ప‌లుమార్లు స‌మావేశం కోసం ప్ర‌తిపాదించినా కేసీఆర్ స్పందించ లేద‌ని నీతి ఆయోగ్ (NITI Ayog) ఆరోపించింది. రాష్ట్రాల‌కు ఎజెండాలు త‌యారు చేయ‌డంలో తాము స‌హ‌కరించం లేద‌న్న విమ‌ర్శ‌లు స‌రైన‌వి కావ‌ని పేర్కొంది.

జ‌ల్ జీవ‌న్ కింద తెలంగాణ‌కు రూ. 3,982 కోట్లు ఇచ్చామ‌ని స్ప‌ష్టం చేసింది. కానీ తెలంగాణ కేవ‌లం రూ. 200 కోట్లు మాత్ర‌మే ఉప‌యోగించుకుంద‌ని వెల్ల‌డించింది.

తాము ప‌లుమార్లు రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని, స‌మావేశాలు ఏర్పాటు చేయాల‌ని కోరినా ఫ‌లితం లేక పోయింద‌ని పేర్కొంది నీతి ఆయోగ్.

Also Read : నీతి ఆయోగ్ ను బ‌హిష్క‌రిస్తున్నా – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!