Nitin Gadkari : విశాఖకు నితిన్ గడ్కరీ ఖుష్ కబర్
6 లైన్ల హైవే మంజూరు
Nitin Gadkari Vizag Visit : ఏపీకి శుభవార్త చెప్పారు కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. విశాఖపట్టణంలో గ్లోబల్ సమ్మిట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర మంత్రి. మరో వైపు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే ప్రకటించిన విధంగానే సాగర తీరం కలిగి ఉన్న విశాఖ పట్టణాన్ని క్యాపిటిల్ సిటీగా చేస్తామని ప్రకటించారు సీఎం. ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ ఇచ్చినందుకు సీఎం సందింటి జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari Vizag Visit).
ఇందులో భాగంగానే విశాఖకు కేంద్ర మంత్రి వరాల జల్లు కురిపించారు. రూ. 6,300 కోట్లతో 6 లైన్ల హైవేను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు నితిన్ గడ్కరీ. ఏపీ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమం లాంటివి వరుసగా నిర్వహించాలని సూచించారు కేంద్ర మంత్రి. ప్రపంచ దేశాల నుంచి ఎందరో పెట్టుబడిదారులు కూడా హాజరు కావడం ఏపీ రాష్ట్రానికి శుభ సూచకమని పేర్కొన్నారు.
ఇప్పటికే 11 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం గ్రేట్ అని స్పష్టం చేశారు. విశాఖ పట్టణంలోని పోర్టుకు 6 లైన్ల హైవేకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇవాళ నీరు, విద్యుత్ , రవాణా, కమ్యూనికేషన్ రంగాలకు ప్రయారిటీ ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి(Nitin Gadkari) .
Also Read : కర్ణాటకలో ఐ ఫోన్ల తయారీ కంపెనీ