Nitin Gadkari : డ్రైవర్ రహిత వాహనాలకు చోటు లేదు
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ
Nitin Gadkari : న్యూఢిల్లీ – కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ రహిత కార్లు వస్తున్నాయని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి తెర దించే ప్రయత్నం చేశారు. 140 కోట్ల మంది కొలువు తీరిన భారత దేశంలో ఇది వర్కవుట్ కాదన్నారు కేంద్ర మంత్రి.
Nitin Gadkari Comment
ఎలాంటి డ్రైవర్లు లేకుండా నడిపే వాహనాలు కొన్ని దేశాలలో మాత్రమే కొనసాగుతుందని, ఇక్కడ అది ఎంత మాత్రం సరిపోదని స్పష్టం చేశారు నితిన్ గడ్కరీ.
ఈ దేశంలో వాహనాలను నమ్ముకుని, వాటి మీద ఆధారపడి బతుకుతున్న డ్రైవర్లు లక్షలాది మందికి పైగా ఉన్నారని పేర్కొన్నారు. డ్రైవర్ రహిత వాహనాలను గనుక పర్మిషన్ ఇచ్చినట్లయితే వీరందరికీ జీవనోపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే మానవతా దృక్ఫథంతో తాము ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగబోమంటూ స్పష్టం చేశారు నితిన్ గడ్కరీ(Nitin Gadkari). కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ ఇలాంటి ఉపాధి లేకుండా చేసే నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబోదంటూ తెలిపారు.
తాము డ్రైవర్ రహిత వాహనాలకు అనుమతి ఇవ్వలేదని, ఇచ్చినట్లు వస్తున్న ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కోరారు కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి .
Also Read : Mallikarjun Kharge : నేను పీఎం రేసులో లేను – ఖర్గే
