Mukesh Sahani : ఊహించని రీతిలో బీహార్ సీఎంపై గుర్తు తెలియని వ్యక్తి దాడి ఘటన చోటు చేసుకున్న అనంతరం నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రివర్గంలో కీలకంగా ఉన్న మంత్రి ముకేష్ సహానీని (Mukesh Sahani)తొలగించారు.
ఎందుకు వేటు వేశారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మంత్రిపై వేటు రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. ముఖేష్ సహానీ (Mukesh Sahani)ఇక పై ఎన్డీఏలో భాగం కాదని వాదించిన మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ నుంచి రాత పూర్వక సమర్పణ తర్వాత మంత్రిపై చర్యలకు ఉపక్రమించారు.
ఈ మేరకు ఆయనను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ కు పంపించారు సీఎం నితీశ్ కుమార్. ఇదిలా ఉండగా బీహార్ మంత్రి వర్గంలో ముకేష్ సహాని రాష్ట్ర మత్స్య , పశు సంవర్దక శాఖ మంత్రిగా ఉన్నారు.
వికాశీల్ ఇన్సాన్ పార్టీకి వ్యవస్థాపక చీఫ్ గా ఉన్నారు ముఖేష్. అయితే ఆయన బీజేపీతో తెగ తెంపులు చేసుకున్నారా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే బీహార్ లో ఎన్డీఏ భాగస్వామ్యంతో ప్రభుత్వం కొలువు తీరి ఉంది.
ఈసారి నితీష్ కుమార్ పార్టీకి ఆశించిన సీట్లు రాలేదు. కానీ ఒప్పందంలో భాగంగా ప్రధాని మోదీ నితీష్ వైపే మొగ్గు చూపారు సీఎంగా ఉండేందుకు. సహానీ తన అసెంబ్లీ స్థానం కోల్పోవడంతో , ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తీరా ముఖేష్ సహానిని తొలగించడం బీహార్ రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.
Also Read : బీహార్ సీఎంపై దాడి – వ్యక్తి అరెస్ట్