Nitish Kumar : సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా
ప్రకటించిన సీఎం నితీశ్ కుమార్
Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ లో మహారాష్ట్ర మోడల్ ను పునరావృతం చేయాలని అమిత్ షా ప్లాన్ చేస్తున్నట్లు ముందస్తుగా గుర్తించాడు.
దాంతో కొంత కాలంగా బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానికి మంగళవారం నాటితో ఎండ్ కార్డ్ పడింది. జేడీయూ చీల్చకుండా ఉండేందుకు బంధానికి బై చెప్పాడు సీఎం.
ఉదయం 11 గంటలకు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో తాను తీసుకోబోయే నిర్ణయం గురించి ప్రకటించారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ను కలిశారు.
ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అనంతరం నితీశ్ కుమార్(Nitish Kumar) మీడియాతో మాట్లాడారు. పదవికి గుడ్ బై చెప్పాను.
ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు కూడా తెలియ చేశానని చెప్పారు. కొత్త సీఎం పదవిని కోరేందుకు ప్రతిపక్ష నేత తేజస్వి యాదవత్ కలోసి రెండోసారి గవర్నర్ ను కలువనున్నారు.
కాంగ్రెస్ వంటి ఇతర పార్టీలు కొత్త కూటమిలో చేరాలని భావిస్తున్నారు. బీజేపీకి షాక్ ఇవ్వడంతో పరిస్థితిని అంచనా వేసేందుకు సుశీల్ కుమార్ మోదీ, కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కూడా ఉన్నారు.
ఇదిలా ఉండగా తన పార్టీకి చెందిన ఆర్సీపీ సింగ్ అమిత్ షాకు ప్రాక్సీగా పని చేశారంటూ ఆరోపించారు నితీశ్ కుమార్. తమ పార్టీ నిర్ణయాలను అమిత్ షా నిర్ణయిస్తారా అంటూ జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ప్రశ్నించారు.
Also Read : గవర్నర్ ను కలవనున్న నితీష్ కుమార్