No Award Given : మిషన్ భగీరథకు అవార్డు ఇవ్వలేదు
కేంద్ర మంత్రిత్వ శాఖ తెలంగాణకు షాక్
No Award Given : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. మిషన్ భగీరథకు తాము ఎలాంటి అవార్డు ఇవ్వలేదంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా కీలక ప్రకటన చేసింది. ఇందులో మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం మూల్యాంకనం చేయలేదని(No Award Given) పేర్కొంది.
తెలంగాణలో 100 శాతం కుళాయి నీటి కనెక్షన్లు అందించినట్లు తాము ధృవీకరించ లేదని స్పష్టం చేసింది. కేవలం ఇందుకు సంబంధించి రాష్ట్ర సర్కార్ మాత్రమే వంద శాతం నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపిందని కానీ ఇంత వరకు తాము ఏ అవార్డు తెలంగాణకు ఇవ్వలేదని కుండ బద్దలు కొట్టింది.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు 100 శాతం కుళాయి కనెక్షన్లు ఉండేలా తీర్మానాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. కానీ ఇప్పటి దాకా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ధ్రువీకరించ లేదని వెల్లడించింది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ఇంటింటికీ తాగు నీటిని సరఫరా చేసినందుకు గాను మిషన్ భగీరథ జాతీయ అవార్డుకు ఎంపికైనట్లు తెలంగాణ ప్రభుత్వం తనంతకు తానుగా ప్రకటించుకుంది. వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రులు ఇక్కడికి తమను , రాష్ట్రాన్ని విమర్శించినా న్యూఢిల్లీలో మాత్రం తమ పనితీరుకు మెచ్చి అవార్డులు ఇస్తూనే ఉంటారని అన్నారు. కాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చివరకు కేంద్ర సర్కార్ స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన పూర్తిగా అబద్దమని పేర్కొంది.
Also Read : ఫుట్ బాల్ మ్యాచ్ లో తొక్కిసలాట