No Ball Controversy IPL : ఉత్కంఠ రేపిన నో బాల్ వివాదం

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ ఆగ్ర‌హం

No Ball Controversy  : ఐపీఎల్ 2022లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇది వివాదానికి దారితీసింది. లీగ్ మ్యాచ్ లో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. 15 ప‌రుగుల తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ 222 ర‌న్స్ చేసింది. ఇక బ‌రిలోకి దిగిన ఢిల్లీ అదే స్థాయిలో పోటీ ఇచ్చింది. మ్యాచ్ సంద‌ర్భంగా నో బాల్ విష‌యంపై తీవ్ర వివాదం చోటు చేసుకుంది.

మ్యాచ్ చివ‌రి ఓవ‌ర్ (20) లో మెక్ కాయ్ వేసిన బంతి ఈ వివాదానికి (No Ball Controversy )కార‌ణ‌మైంది. చివ‌రి ఓవ‌ర్ లో 36 ర‌న్స్ కావాల్సి వ‌చ్చింది. తొలి మూడు బంతుల్లో పావెల్ సిక్స‌ర్లు కొట్టాడు.

కాగా మూడో బాల్ ఫుల్ టాస్ గా వ‌చ్చింది. దీనిని నో బాల్ ప్ర‌క‌టించాల్సి ఉండ‌గా ఇవ్వ‌లేదు అంపైర్. దీనిపై పెద్ద రాద్దాంత‌మే రేగింది. కెప్టెన్ పంత్, కోచ్ ప్ర‌వీణ్ ఆమ్రే తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

ఒక ద‌శ‌లో ఆమ్రే మైదానంలోకి వ‌చ్చాడు. అంపైర్ తో వాగ్వావాదానికి దిగాడు. ఇంకో వైపు కెప్టెన్ పంత్ త‌మ బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ కు వ‌చ్చేయ‌మంటూ పిలుపు ఇచ్చాడు. దీంతో మైదానంలో కొంత ఉద్రిక‌త్త ప‌రిస్థితి చోటు చేసుకుంది.

ఢిల్లీ డ‌గౌట్ లో తీవ్రా ఆగ్ర‌హం క‌నిపించంది. నో బాల్ ఇవ్వ‌మంటూ వారంతా లాన్స్ లో సైగ‌లు చేశారు. ఇక గ్రౌండ్ లో ఉన్న అంపైర్ల‌తో పాటు యుజ్వేంద్ర చ‌హ‌ల్ , త‌దిత‌రులు బ్యాట‌ర్ల‌కు న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

అంపైర్ నితిన్ మాత్రం త‌న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డుతూ నో బాల్ ఇచ్చేందుకు ఒప్పు కోలేదు. కాగా ఐసీసీ రూల్స్ ప్ర‌కారం అవుటైన బంతుల‌కు మాత్ర‌మే థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యం తీసుకుంటారు. ఈ విష‌యంలో పూర్తి అధికారం అంపైర్ కు ఉంటుంది.

Also Read : జోస్ బ‌ట్ల‌ర్ ప‌డిక్క‌ల్ స‌య్యాట

Leave A Reply

Your Email Id will not be published!