Afghan Women No Entry : పార్కుల్లో మహిళలకు నో ఎంట్రీ
అమ్యూజ్ మెంట్ పార్కుల్లోకి నో ఎంట్రీ
Afghan Women No Entry : తాలిబన్లు ఎప్పుడైతే ఆఫ్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నారో ఆనాటి నుంచి మహిళలు, బాలికలు, యువతులకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికే పాఠశాలలను మ మూసి వేశారు. సాయుధలైన ఉగ్రవాదులు తరగతి గదుల్లో డ్యాన్సులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కలకలం రేపింది.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా కాబూల్ లోని అమ్యూజ్ మెంట్ పార్కుల్లోకి ఆఫ్గనిస్తాన్ మహిళకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఎవరైనా అటు వైపు వెళ్లాలని ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకుంటున్నారు. ఒక రకంగా దాడి చేస్తున్నారు. పలువురు మహిళలను తిప్పి పంపారు.
పరిస్థితిని గమనించేందుకు తాలిబన్ ఏజెంట్లు కూడా వచ్చారు. అయితే తాము వేధింపులకు పాల్పడడం లేదని, తమ ఇస్లామిక్ చట్టాల కు అనుగుణంగా ఉండాలని కోరుతున్నామని స్పష్టం చేశారు తాలిబన్లు. మహిళల హక్కులను గౌరవిస్తామని తెలిపారు.
గత ఏడాది ఆగస్టులో ఆఫ్గనిస్తాన్ పై తాలిబన్లు ఆధీనంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై దాడులు, ప్రాథమిక హక్కులకు భంగం కలగడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు కాబూల్ లోని అమ్యూజ్ మెంట్ పార్కుల్లోకి మహిళలను(Afghan Women No Entry) అనుమతించేది లేదంటూ అక్కడి పోలీసులు హుకూం జారీ చేశారు.
ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. దీని గురించి స్పందించారు ఆఫ్గనిస్తాన్ ధర్మ ప్రచారం, నివారణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి. పిల్లలు ఆడుకునేందుకు పార్కుల్లోకి వెళ్లాలని కోరుకుంటారు. కానీ తాము అక్కడికి వెళ్లే సరికి అభ్యంతరం తెలిపారంటూ బాధిత మహిళలు వాపోయారు.
Also Read : ఎవరీ శరత్ చంద్రా రెడ్డి ఏమిటా కథ