Shashi Tharoor : అంబానీ..అదానీల పట్ల ద్వేషం లేదు
ఎంపీ శశి థరూర్ షాకింగ్ కామెంట్స్
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ పదే పదే భారతీయ దిగ్గజ వ్యాపారవేత్తలైన ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, టాటాలను విమర్శిస్తూ వస్తున్నారు.
వారికి లబ్ది చేకూర్చేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి స్వరం టీంలో సభ్యుడిగా ఉన్న శశి థరూర్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. తనకు అంబానీలు, అదానీల పట్ల ద్వేషం లేదని స్పష్టం చేశారు.
పార్టీ చెబుతున్నది కూడా అదే. ఆయా రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకు వస్తామన్నా లేదా పెడతామని వచ్చినా తాము స్వాగతం చెబుతామన్నారు. ఉద్యోగాలు సృష్టించేందుకు వీలు కల్పిస్తామంటే ఎవరు అడ్డు చెబుతారంటూ శశి థరూర్(Shashi Tharoor) ప్రశ్నించారు. ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది రాజస్థాన్ లో గౌతం అదానీ రూ. 65,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని ప్రకటించారు.
ఈ సందర్బంగా ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ అదానీని భాయ్ అని ప్రేమ పూర్వకంగా పిలిచారు. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు రాహుల్ గాంధీ. ఒక రకంగా గౌతం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరువనంతపురంలో ఎయిర్ పోర్ట్ కోసం వేలం వేయబడింది. అదానీకి దక్కింది. అది నా స్వంత నియోజకవర్గంలో ఉందన్నారు శశి థరూర్.
Also Read : కాంగ్రెస్ శ్రేణుల్లో యాత్ర జోష్