CJI Chandrachud : ప్రజాస్వామంలో ఏ సంస్థా పరిపూర్ణం కాదు
సంచలన కామెంట్స్ చేసిన చంద్రచూడ్
CJI Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్(CJI Chandrachud) సంచలన కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ సంస్థా పరిపూర్ణం కాదని కానీ దానిని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నాతో సహా కొలీజియంలోని న్యాయమూర్తులందరూ రాజ్యాంగాన్ని అమలు చేసే నమ్మకమైన సైనికులమని స్పష్టం చేశారు.
కాలం మారుతోంది. అభిప్రాయాలు మారుతున్నాయి. కొత్త సామాజిక వాస్తవాలకు అనుగుణంగా రాజ్యాంగం నిరంతరం అభివృద్ది చెందుతోందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. న్యూఢిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలో సీజేఐ డీవై చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
2015 నుండి 1949లో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిడంతో ఆనాటి నుంచి జ్ఞాపకార్థం నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నారు. అంతకు ముందు ఇవాల్టి రోజును న్యాయ దినోత్సవంగా పాటించారు. కొలీజియం అంశంపై కూడా సీజేఐ చంద్రచూడ్(CJI Chandrachud) కీలక వ్యాఖ్యలు చేశారు.
చివరకు దీనిపై కూడా విమర్శలు వచ్చాయి. నేను చివరి వరకు ఉత్తమమైన దానిని రిజర్వ్ చేస్తానని అనుకున్నానని అన్నారు. రాజ్యాంగబద్దమైన డెమోక్రసీలో ఏ సంస్థ పరిపూర్ణమైనది కాదని, కానీ తాము రాజ్యాంగ పరిధిలో పని చేస్తామని స్పష్టం చేశారు సీజేఐ.
ప్రస్తుతవ్యవస్థలో మన మార్గంలో పని చేయడమే అత్యుత్తమమైన పరిష్కారమన్నారు. న్యాయ వ్యవస్థలో మంచి వ్యక్తులను పొందడం, వారికి అత్యధిక జీతాలు చెల్లిండచం కొలీజియం వ్యవస్థను సంస్కరించడం కాదన్నారు.
మంచి సమాజాన్ని తయారు చేయడంలో న్యాయమూర్తులు కూడా కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పారు జస్టిస్ చంద్రచూడ్.
Also Read : డ్రెస్ కోడ్ అత్యంత ముఖ్యం – సీజేఐ