Chinna Jeeyar Swamy : చిన‌జీయ‌ర్ కు అంద‌ని ఆహ్వానం

పేరు లేకుండానే యాదాద్రి ప్రారంభం

Chinna Jeeyar Swamy : ఇది ఊహించ‌ని ప‌రిణామం. అప‌ర భ‌క్తుడిగా ఇప్ప‌టికే పేరొందారు తెలంగాణ సీఎం కేసీఆర్. జ‌గ‌త్ గురువుగా పేరొందారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి.

ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో యాదగిరిగుట్ట (యాదాద్రి) శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ్మ స్వామి ఆల‌య పున‌ర్ వైభ‌వం సంత‌రించుకుంది. ప్ర‌ముఖ ఆర్కిటెక్చ‌ర్ ఆనంద‌సాయి సార‌థ్యంలో పునర్ నిర్మాణం పూర్త‌యింది.

భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో చినజీయ‌ర్ స్వామి (Chinna Jeeyar Swamy)పేరు లేక పోవ‌డం విస్తు పోయేలా చేసింది.

ఈనెల 21 నుంచి 28 వ‌ర‌కు కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌ధానాల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల‌గ‌నుంది. ఆల‌య అర్చ‌కుల‌తోనే మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ పూజ‌లు ప్రారంభ‌మ‌వుతాయి.

విచిత్రం ఏమిటంటే తెలంగాణ స‌ర్కార్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న చిన జీయ‌ర్ కు షాక్ ఇచ్చింది. ఆయ‌న పేరు లేకుండా చేసింది. ప్ర‌స్తుతం స్వామి వారికి పిలుపు లేక పోవ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

ఆల‌య ప్రారంభానికి సంబంధించి జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌లో చిన జీయ‌ర్ స్వామి పేరు లేక పోవ‌డం శోచ‌నీయం. బాలాల‌యంలో మ‌హా సుద‌ర్శ‌న యాగం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

108 మంది పారాయ‌ణికులు, ఆల‌య వేద పండితులు పాల్గొంటార‌ని వెల్ల‌డించారు. స్వామి పెట్టిన ముహూర్తానికే పూజ‌లు జ‌రుగుతాయ‌ని తెలిపారే త‌ప్పా స్వామికి పిలుపు అందించ‌లేదు.

ఆల‌యాన్ని తామే ప్రారంభిస్తామంటూ ప్ర‌ధాన అర్చ‌కులు వెల్ల‌డించారు. 28న మ‌హా కుంభ సంప్రోక్ష‌ణ జ‌రుగుతుంద‌ని తెలిపారు.
ఇదిలా ఉండ‌గా సుద‌ర్శ‌న యాగం నిర్వ‌హించ‌నున్న త‌రుణంలో బాలాల‌యంలో ఆర్జిత సేవ‌లు ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

Also Read : 28 నుంచి యాదాద్రి పున‌ర్ద‌ర్శ‌నం

Leave A Reply

Your Email Id will not be published!