Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ట్వీట్లు కలకలం రేపుతూనే ఉంటాయి. ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చారు.
తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలతో హల్ చల్ చేశారు. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను టార్గెట్ చేశారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ తాను భారత ప్రధాని మోదీతో టీవీ డిబేట్ లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు శశి థరూర్(Shashi Tharoor ). ఇద్దరు ప్రధానులు కలిసి చర్చించడం వల్ల ఆయా ప్రసార, ప్రచురణ, సామాజిక మాధ్యమాలకు రేటింగ్ పెరుగుతుందే తప్పా ఇరు దేశాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు, సరిహద్దు వివాదాలు, తగాదాలు తగ్గవని కుండ బద్దలు కొట్టారు శశి థరూర్.
యుద్దం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. విలువైన కాలాన్ని వృధా చేయడం తప్ప ఏమీ కాదన్నారు. టెలివిజన్ చర్చలలో ఎటువంటి సమస్యలు పరిష్కారం కావని , కేవలం అవి మరింత తీవ్రం అవుతాయని హెచ్చరించారు.
మాస్కోలో రెండు రోజుల పాటు పర్యటించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అక్కడి రష్యా టీవీతో మాట్లాడుతూ భారత దేశంతో తాము సయోధ్య కోరుకుంటున్నామని, టీవీ డిబేట్ లో మోదీతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.
ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారి తీశాయి. కాగా పాక్ ప్రధాని చేసిన ప్రతిపాదనకు భారత ప్రభుత్వం ఇంకా స్పందించ లేదు. అంత లోపే శశి థరూర్ ట్వీట్ ఇప్పుడు మరింత అగ్గిని రాజేసింది.
Also Read : సమాజ్ వాదీ పార్టీపై మాయావతి సెటైర్