Mamata Banerjee BBC Row : దేశంలో ఏ మీడియా మిగలదు – సీఎం
బీబీసీపై ఐటీ దాడుల నేపథ్యంలో
Mamata Banerjee BBC Row : మోదీ ది క్వశ్చన్ పేరుతో బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదానికి దారి తీసింది. దానిపై నిషేధం విధించింది మోదీ ప్రభుత్వం. ఆ వెంటనే కేంద్ర ఆదాయ పన్ను శాఖ రెండు రోజులుగా బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసులలో సోదాలు చేపట్టింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ , టీఎంసీ, ఆప్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే సమయంలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారంటూ జైరాం రమేష్ , మహూవా మోయిత్రా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ , ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee BBC Row) తీవ్ర స్థాయిలో స్పందించాడు. మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో ఏ మీడియా మిగలదన్నారు. ఇలా దాడులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు.
చివరకు న్యాయ వ్యవస్థను స్వాధీనం చేసుకోవాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశం ఎటు పోతుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ దేశాన్ని న్యాయ వ్యవస్థ ఒక్కటే రక్షిస్తుందని అన్నారు. ఇదే గనుక లేకపోతే రాచరికం రాజ్యం ఏళుతుందన్నారు.
బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో దాడులకు పాల్పడడం దారుణమని పేర్కొన్నారు. ఇది ఒక రకంగా పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఫైర్ అయ్యారు మమతా బెనర్జీ.
ఆదాయ పన్ను శాఖ దాడులు చేయడంపై మండిపడ్డారు సీఎం. ఒక రకంగా రాజకీయ ప్రతీకార చర్యనేనని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలనేది మోదీ సర్కార్ లక్ష్యం. చివరకు ప్రజల తరపున వాయిస్ వినిపిస్తున్న మీడియాను(Mamata Banerjee BBC Row) కూడా నియంత్రించాలని అనుకుంటుందని సంచలన ఆరోపణలు చేశారు దీదీ.
Also Read : పత్రికా స్వేచ్ఛపై దాడి – కేజ్రీవాల్