BJP No Muslim : ముస్లింలకు బీజేపీ రిక్త హస్తం
రాజ్యసభ జాబితాలో నో చాన్స్
BJP No Muslim : భారతీయ జనతా పార్టీలో ముస్లిం నాయకులకు గతంలో ప్రయారిటీ ఉండేది. నఖ్వీ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. కానీ ఈసారి ఆయనకు చాన్స్ దక్కలేదు. ఎప్పటి లాగా పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ కు అవకాశం ఇచ్చింది బీజేపీ.
దేశంలోని 15 రాష్ట్రాలలో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ(BJP No Muslim) ప్రకటించిన లిస్టులో ముస్లిం నాయకులకు చెందిన ఏ ఒక్కరి పేరు లేక పోవడం పార్టీలో చర్చకు దారితీసింది.
ఇక ఇప్పటి వరకు రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారున్నారు. వారిలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సయ్యద్ జాఫర్ ఇస్లాం, ఎంజే అక్బర్ ఉన్నారు. ఈ ముగ్గురు తమ పదవీ కాలాన్ని త్వరలో పూర్తి చేసుకోనున్నారు.
వీరి స్థానాలు ఖాళీ కానుండడంతో తిరిగి ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి చాన్స్ దక్కుతుందని భావించారు. కానీ బీజేపీ(BJP No Muslim) హైకమాండ్ వారికి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
కొత్త వారికి చాన్స్ ఇచ్చింది. ప్రత్యేకించి ప్రకటించిన 16 మందిలో 11 మంది గంప గుత్తగా ఉత్తర ప్రదేశ్ నుంచే ఎంపిక చేయడం గమనార్హం.
దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో అంటే లోక్ సభ, రాజ్యసభలలో ముస్లిం ఎంపీలు అంటూ ఎవరూ ఉండరు. ఇది ఒక రకంగా రేపు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ముఖ్యం కానున్నాయి.
ఎలా ఓట్లు అడుగుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. జూన్ 10న జరగనున్న ఎగువ సభ ఎన్నికలకు 22 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. వారిలో ఎవరూ ముస్లింలు లేరు.
Also Read : కుల్గామ్ లో హిందూ టీచర్ కాల్చివేత