Dr NK Arora : క‌రోనా కొత్త వేవ్ లేదు ఆందోళ‌న వ‌ద్దు

కోవిడ్ ప్యాన‌ల్ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Dr NK Arora : దేశ వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. గ‌త ఐదు రోజులుగా క‌రోనా కేసులు కొత్త‌వి న‌మోద‌వుతున్నాయి. దీంతో రంగంలోకి దిగింది కేంద్రం. ఇప్ప‌టికే క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించింది.

ఈ మేర‌కు మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయాల‌ని, రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూడాల‌ని సూచించింది. ఆస్ప‌త్రుల‌లో బెడ్స్ , ఆక్సిజ‌న్ సౌక‌ర్యం అందుబాటులో ఉంచేలాని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స‌మీక్ష చేప‌ట్టారు.

ఈ త‌రుణంలో క‌రోనా కొత్త వేవ్ లేనే లేద‌ని, అది రానే రాద‌ని అంత‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు కోవిడ్ ప్యానెల్ చీఫ్ డాక్ట‌ర్ కె. అరోరా. కేసులు, పాజిటివిటీ రేటు ముఖ్యం కాద‌ని , ఆస్ప‌త్రిలో అడ్మిష‌న్లు పెర‌గ‌క పోవ‌డమే కీల‌క‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైర‌స్ అనేది తీవ్ర‌మైన వ్యాధికి కార‌ణం కాద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇటీవ‌ల ఇన్ ఫెక్ష‌న్లు స్వ‌ల్పంగా న‌మోద‌య్యాయి. రోగులు నాలుగు నుండి ఐదు రోజుల్లో కోలుకుంటార‌ని ఆయ‌న జాతీయ మీడియాతో చెప్పారు. తీవ్ర‌మైన అనారోగ్యం వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ వ‌ర్కింగ్ చైర్మ‌న్ డాక్ట‌ర్ ఎన్ కే అరోరా.

Also Read : మారిన స్వ‌రం సోనియా ఆహ్వానం

Leave A Reply

Your Email Id will not be published!