#SiriVennela : సిరివెన్నెల తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం
సినీ వెన్నెల సిరి వెన్నెల
Siri Vennela : వయసు పెరిగే కొద్దీ ఆయన మరీ యువకుడై పోతున్నారు. తెలుగు సాహిత్యానికి వన్నెలద్ది..సినిమాలో తనదైన ముద్ర వేసిన ఆయనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి. గేయ రచయితగా అత్యున్నతమైన స్థానాన్ని అందుకున్న యోగి. కవి.రచయిత. నటుడు. భావుకుడు. ఏ సమయంలోనైనా రాయగల నేర్పు కలిగిన అరుదైన వ్యక్తి ..సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్నారు.
ఆయన కలం లోంచి జాలువారిన ప్రతి అక్షరం తెలుగు వాకిట గవాక్షమై నిలిచి పోయింది. ఆకాశమంత కీర్తి శిఖరాలను అందుకున్న ఈ అక్షర పితామహుడి సినీ ప్రస్థానంలో లెక్కలేనన్ని పురస్కారాలు..అవార్డులు..ప్రశంసలు ఉన్నాయి. తనతో పాటు ఎందరినో గేయ రచయితలుగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఆయనదే.
బలపం పట్టి బామ్మ బళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా అని రాసిన సిరివెన్నెల..నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అంటూ ప్రశ్నించడం నేర్పాడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ సానుకూల దృక్ఫథాన్ని పాటల ద్వారా తెలియ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఈ జీవితం ఎంత సంక్లిష్టమైనదో..ఎలాంటి ముఖాల ముసుగులను వేసుకుని నటిస్తున్నామో కుండ బద్దలు కొట్టినట్టు ఓ సందర్భంలో
.. అప్పుడెప్పుడో ఆటవికం..మరి ఇప్పుడు ఆధునికం..యుగయుగాలుగా ఏం మృగాలకన్నా ఎక్కువ ఏం ఎదిగాం అంటూ ప్రశ్నించారు.
.ఎంఏ చేస్తుండగా ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ గారి కంట్లో పడ్డాడు. ఇక అప్పటి నుంచి రాసుకుంటూ వెళుతూనే ఉన్నారు. తన సినిమా సిరివెన్నెలకు తీసుకున్నారు.
ఆ సినిమా విడుదలయ్యాక..పాటలే సినిమాకు ప్రాణమయ్యాయి. విజయం సాధించేందుకు దోహదపడ్డాయి. సీతారామశాస్త్రికి ముందు సిరివెన్నెలగా విశ్వనాథ్ మార్చేశారు. ఆ సినిమానే ఇంటి పేరైంది..అందరికీ ఇష్టమైన రచయితగా మార్చేసింది. ఓ వైపు పాటలు రాస్తూనే ..మరో వైపు తన సాహిత్య పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే ఉన్నారు.
వయసు పెరిగిన కొద్దీ కొందరు అలాగే ఉండిపోతారు..కానీ సిరివెన్నెల(Siri Vennela )సముద్రమంత హోరుతో పరుగులు తీస్తూనే ఉన్నారు. కొత్త దనంతో పోటీపడుతూనే హృదయాలను హత్తుకునేలా గీతాలు రాస్తున్నారు. 300 పాటలతో శివకావ్యం పేరుతో పుస్తకం రాశారు. విధాత తలపున ప్రభవించినది..అంటూ సిరివెన్నెల రాసిన మొదటి పాటే సినీ రంగాన్ని కుదిపేసింది.
జనం గుండెల్లో గూడు కట్టుకునేలా మార్చేసింది. భావగర్భితమైన పాటగా పేరొందిన దీనిని రాసేందుకు ఓ వారం రోజులు పట్టిందని ఓ సందర్భంలో సిరివెన్నెల తెలిపారు. ధనం చేసే మాయను చిన్న చిన్న పదాలతో పాట కట్టగలరో..అదే సమయంలో దైవం చేసే మాయను కూడా చెప్పగలరు ఇదే ఆయనకున్న ప్రత్యేకత.
కళ్లు సినిమాలో ఆయనే నటించి పాడిన పాట ఇప్పటికీ స్మరించుకునేలా ఉంటుంది. తెల్లారింది లేగండోయ్..కొక్కరకో ..మంచాలిగ దిగండోయ్..అంటూ ఆర్ద్రంగా పాడారు. రుద్రవీణలో రాసిన నమ్మకు నమ్మకు ఈ రేయిని..కమ్ముకు వచ్చిన ఈ మాయని..చాలా పాపులర్ సాంగ్‌గా నిలిచింది. సిరివెన్నెల కలం లోంచి జాలువారిన అనేక పాటల్లో ప్రతి పాట గుర్తుంచు కోదగినదే.
లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు. స్వర్ణకమలం సినిమాలోని పాటలు హిట్‌గా నిలిచాయి. ఆకాశంలో హరివిల్లు..అందెల రవమిది..శృతిలయలులో తెలవారదేమో స్వామి..రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాలోని బోటనీ పాటముంది..మ్యాటనీ ఆట ఉంది..దేనికో ఓటు చెప్పరా అంటూ హుషారైన పాట రాసి మెప్పించారు.
క్షణక్షణంలో కో అంటే కోటి..జాము రాతిరి జాబిలమ్మా..గాయంలో అలుపన్నది ఉందా..నిగ్గదీసి అడుగు..స్వరాజ్యమనలేని సురాజ్యమెందుకని..గులాబీలో ఏ రోజైతే చూశానో నిన్ను, క్లాసు రూంలో తపస్సు చేయుట వేస్టురా గురూ..ఈ వేళలో ఏం చేస్తు ఉంటావో..శుభలగ్నంలో చిలకా ఏ తోడు లేక..ఎటేపమ్మ ఒంటరి నడక
నిన్నే పెళ్లాడుతాలో కన్నుల్లో నీ రూపమే..సింధూరంలో అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా..దేవీపుత్రుడులో ఓ ప్రేమా..చంద్రలేఖలో ఒక్కసారి నవ్వి చూడయ్యో, నువ్వే కావాలి మూవీలో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు, శుభసంకల్పంలో హైలెస్సో హైలెస్సా, సీతమ్మ అందాలూ..పట్టుదలలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
అంటూ రాసిన పాటలన్నీ హిట్‌గా నిలిచాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు మరెన్నో పాటలున్నాయి. తాజాగా త్రివిక్రం తీసిన సినిమా అల వైకుంఠ పురంలో ఆయన రాసిన నీ కాళ్ళను పట్టుకుని అనే సాంగ్ ఇండియాలో పాపులర్ అయింది. ద్వందర్థాలకు చెక్ పెట్టారు. ఎవరు వచ్చినా ఆయన దరిదాపుల్లో నిలవటం కష్టం. సిరివెన్నెల(Siri Vennela )తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం కాదంటారా.
No comment allowed please