BS Yediyurappa : నన్నెవరూ అంతం చేయలేరు – యెడ్డీ
మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప కామెంట్స్
BS Yediyurappa : కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప(BS Yediyurappa) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీకి దూరంగా ఉన్నానని వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. తాను ఏనాడూ పదవి కోసం పైరవీ చేయలేదన్నారు. నాకు అధికార కాంక్ష లేదు. భారతీయ జనతా పార్టీని తిరిగి కర్ణాటకలో పవర్ లోకి తీసుకు రావాలన్నదే నా లక్ష్యం.
దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టానని అన్నారు. దాని కోసం అందరం కలిసి పని చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు కన్నడ నాట ఎవర్ గ్రీన్ లీడర్ గా ఉన్నారు. అయితే పార్టీలో తనను పక్కన పెడుతున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై ఆయన గురువారం తీవ్రంగా స్పందించారు.
తనకు స్వంత బలం ఉందని స్పష్టం చేశారు. తనను ఎవరూ రాజకీయంగా అంతం చేయలేరని కుండ బద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో తనకు విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలను కొట్టి పారేశారు. నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారనేది బక్వాస్. ఎవరో కావాలని చేస్తున్న ప్రచారం అని పేర్కొన్నారు. బెంగళూరులో బీఎస్ యెడ్యూరప్ప(BS Yediyurappa) ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
జిల్లా కేంద్రమైన కొప్పల్ పట్టణానికి బయలుదేరే ముందు అక్కడ పార్టీ చీఫ్ జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఎవరూ ఎవరినీ అంతం చేయలేరు. నాకంటూ స్వంత బలం, బలగం ఉందన్నారు యెడ్యూరప్ప. ఈ విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చిన వారిలో తాను ఒకడినని చెప్పారు.
Also Read : వారసత్వం అబద్దం పనితీరుకే పట్టం