Varun Gandhi Mandaviya : అరుదైన పథకం అందని సాయం
కేంద్ర సర్కార్ పై ఎంపీ ఆగ్రహం
Varun Gandhi Mandaviya : భారతీయ జనతా పార్టీలో కంట్లో నలుసుగా మారారు ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi). ఆయన ప్రజల తరపున మాట్లాడుతున్నారు. వారి కోసం నినదిస్తున్నారు. ఒక రకంగా బీజేపీ
కి చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు, ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి అమిత్ షాకు కోలుకోలేని షాక్ లు ఇస్తున్నారు. ఆయన నోట్ల రద్దును ఒప్పుకోలేదు. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టిన రైతన్నలకు అండగా నిలిచారు. ఆపై కేంద్రాన్ని తప్పు పట్టారు.
ఇదే సమయంలో అగ్ని పథ్ స్కీంను విమర్శించారు. అంతే కాదు కోట్లాది జాబ్స్ ఉన్నా ఎందుకని ఇప్పటి వరకు జాబ్స్ భర్తీ చేయడం లేదంటూ ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పలేక కేంద్రం మౌనంగా ఉంటోంది. తాజాగా మరో బాంబు పేల్చారు వరుణ్ గాంధీ. అరుదైన వ్యాధులకు సంబధించి కేంద్రం ప్రవేశ పెట్టిన సహాయ పథకం వల్ల ఒక్క రోగికి మేలు జరగలేదని సంచలన ఆరోపణలు చేశారు.
కనీసం ఈ స్కీం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. అరుదైన వ్యాధులకు ఎక్కువగా పిల్లలు గురవుతున్నారని ఆందోళన చెందారు. వీటిలో ఎక్కువగా లైసోసోమల్ స్టోరేజీ డిజార్డర్స్ గౌచర్ , పాంపే, ఎంపీఎస్ఐ, ఎంపీఎస్ -2 , ఫాబ్రీ డిసీజ్ లతో బాధ పడుతున్నారని పేర్కొన్నారు వరుణ్ గాంధీ(Varun Gandhi).
ఈ స్కీంకు సంబంధించి కేంద్ర మంత్రి వెంటనే స్పందించాలని కోరారు ఎంపీ. ఈ వ్యాధికి గురైన వారికి కేంద్ర సర్కార్ రూ. 50 లక్షలు అందజేస్తుంది. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021లో కేంద్రం పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు ఎంపీ. 432 మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : రామ మందిరం ద్వేష పూరిత స్థలం