Daleep Singh : ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా ఆంక్షలు విధించింది. యుఎస్ తో పాటు యూరోపియన్ యూనియన్ తో పాటు ఫ్రాన్స్, బ్రిటన్, తదితర దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి.
ఈ తరుణంలో అమెరికా ఇటీవల రష్యాతో అంటకాగుతున్న భారత్ పై గత కొంత కాలం నుంచి నిప్పులు చెరుగుతోంది. తాజాగా యుఎస్ క్లారిటీ ఇచ్చింది ఇండియాపై.
అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉక్రెయిన్ పై యుద్దంలో రష్యాపై ఆర్థిక ఆంక్షల రూప శిల్పిగా పేరొందారు.
ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో దలీప సింగ్ కుండబద్దలు కొట్టారు. భారత్ పట్ల అమెరికాకు పూర్తిగా సానుకూల ధోరణి ఉంటుందన్నారు.
రష్యా నుంచి చమురు దిగుమతులపై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, నిర్మాణాత్మకంగా చర్చలు జరిపారంటూ వైట్ హౌస్ స్పష్టం చేసింది.
రష్యా కంటే భారత్ అమెరికా నుంచి ఎక్కువ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. దలీప్ సింగ్ ఇటీవల ఇండియా టూర్ కు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకీ .
భారత తో స్నేహం ఉంటుందని శత్రుత్వం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దలీప్ సింగ్ వెళ్లింది ఇండియాతో నిర్మాణాత్మకమైన భాగస్వామ్యం పెంపొందించు కునేందుకు వెళ్లారంటూ తెలిపారు.
ప్రతి దేశానికి ఓ స్పష్టమైన విదేశాంగ విధానం ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో దలీప్ సింగ్ (Daleep Singh)కూడా క్లారిటీ ఇవ్వడంతో అనిశ్చితి స్థితి తొలగింది.
Also Read : భారత్ శక్తివంతం అడ్డుకోవడం కష్టం