Writing With Fire : ఈసారి ఆస్కార్ అవార్డులలో భారత దేశానికి చెందిన డాక్యుమెంటరీ ప్రశంసలు అందుకుంది. మేడ్ ఇన్ ఇండియా రైటింగ్ విత్ ఫైర్(Writing With Fire )94వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ గా ఆస్కార్ ను కోల్పోయింది.
కానీ దానికి బదులుగా సమ్మర్ ఆఫ్ సోల్ గెలిచింది. ఉత్తమ డాక్యుమెంటరీఈ ఫీచర్ కేటగిరీలోని ఇతర పోటీదారులు అసెన్షన్, అట్టికా, ప్లీ, రైటింగ్ విత్ ఫైర్ నిలిచాయి. ఈ చిత్రాన్ని సుష్మిత్ ఘోష్, రింటు థామస్ దర్శకత్వం వహించి నిర్మించారు.
వీరే దీనిని ఎడిట్ చేశారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో దళిత మహిళా జర్నలిస్టులు నిర్వహిస్తున్న ఖబర్ లహరియా అనే వార్తా పత్రిక కథానం ఆధారంగా దీనిని తెరకెక్కించే ప్రయత్నం చేశారు.
ఇది దేశంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో కొన్ని వార్తలను , కథనాలను తీసుకు వచ్చింది. ఐదు సంవత్సరాల పాటు దీనిని చిత్రీకరించారు. రైటింగ్ విత్ ఫైర్(Writing With Fire )అని పేరు పెట్టారు.
ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్ లో మంచి ఆదరణ పొందింది. సన్ డాల్ఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు, ఆడియన్స్ అవార్డుతో సహా అనేక బహుమతులు గెలుచుకుంది.
రైటింగ్ విత్ ఫైర్ ఆస్కార్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ గా నామినేట్ చేసిన మొదటి భారతీయ చిత్రం. ఇదిలా ఉండగా ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించింది ప్రియాంక చోప్రా.
వే టు గో టీమ్..రైటింగ్ విత్ ఫైర్ అన్ని అర్హతలు కలిగిన గొప్పనైన సినిమా అని కితాబు ఇచ్చింది చోప్రా.
Also Read : అవును ఆ రెండు సంస్ధలూ ఒక్కటయ్యాయి