Zelensky : సాయం కాదు పెట్టుబడి మాత్రమే – జెలెన్ స్కీ
యుఎస్ కాంగ్రెస్ సమావేశంలో ప్రెసిడెంట్
Zelensky : ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తున్నది సహాయం కాదని అది పెట్టుబడి మాత్రమేనని పేర్కొన్నారు. యుఎస్ కాంగ్రెస్ లో ప్రసంగించేందుకు వచ్చిన జెలెన్ స్కీకి పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గ
త కొంత కాలంగా రష్యా ఏకపక్షంగా దాడులకు పాల్పడుతోందని, యావత్ ప్రపంచం నెత్తి నోరు మొత్తుకున్నా పట్టించు కోవడం లేదంటూ ఆరోపించారు. రష్యాపై యుద్దం చేసేందుకు ఆమోదించిన 10 బిలియన్ల డాలర్ల సహాయం స్వచ్చంధ సంస్థ కాదని, ప్రపంచ భద్రతలో అది పెట్టుబడి మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో యుద్దం ప్రారంభమైంది. ఆనాటి నుంచి తన దేశం నుండి మొదటిసారిగా సందర్శించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఛాంబర్ లో చట్ట సభ సభ్యులతో మాట్లాడారు జెలెన్ స్కీ(Zelensky). ఉక్రెయిన్ కు ద్వైపాక్షిక ప్రాతిపదికన మద్దతు ఇస్తూనే ఉంటారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
దీనిని తాను సాయంగా భావించడం లేదన్నారు. ఇది పూర్తిగా ప్రపంచ సెక్యూరిటీలో, అంతకు మించి ప్రజాస్వామ్యంలో ఇన్వెస్ట్ మెంట్ గా భావిస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుఎస్ కాంగ్రెస్ లో ఉండి మీతో, అమెరికన్లందరితో మాట్లాడటం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
ఉక్రెయిన్ పతనం కాలేదు ఇంకా సజీవంగానే ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ మనసుల కోసం జరిగిన యుద్దంలో తాము రష్యాను ఓడించామని అన్నారు జెలెన్ స్కీ.
Also Read : కేంద్రం నిర్వాకం ఆర్మీ బలహీనం