CJI DY Chandrachud : భయపడి బెయిల్ ఇవ్వడం లేదు – సీజేఐ
డీవై చంద్రచూడ్ సంచలన కామెంట్స్
CJI DY Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ చంద్రచూడ్(CJI DY Chandrachud) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏకంగా న్యాయమూర్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. టార్గెట్ కు గురి అవుతారనే భయంతోనే జడ్జీలు బెయిల్ ఇవ్వడానికి ఇష్ట పడడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కింది స్థాయి న్యాయమూర్తులు బెయిల్ మంజూరు చేసేందుకు ఇష్ట పడటం నేరం అర్థం కానుందు వల్ల కాదని గుర్తు పెట్టుకోవాలి. కానీ తమను లక్ష్యంగా చేసుకుంటారనే భయంతోనే బెయిల్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదన్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్. విచిత్రం ఏమిటంటే సీజేఐ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఇటీవల న్యాయ వ్యవస్థను ప్రధానంగా కొలీజియం సిస్టమ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు కిరెన్ రిజిజు. ప్రపంచంలో కొలీజియం వ్యవస్థ లేదని కేవలం భారత్ లో ఉందని అభ్యంతరం తెలిపారు. ఇదిలా ఉండగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ చంద్రచూడ్ తో పాటు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పాల్గొన్నారు.
బెయిల్ మంజూరు చేసేందుకు అట్టడుగు స్థాయిలో ఉన్న విముఖత కారణంగా ఉన్నత న్యాయ వ్యవస్థ బెయిల్ దరఖాస్తులతో నిండి పోయిందన్నారు. కింది స్థాయి న్యాయమూర్తులు బెయిల్ మంజూరు చేసేందుకు ఇష్టపడరు. ఎందుకంటే వారు నేరాన్ని అర్థం చేసుకోలేరు. కానీ హేయమైన కేసులలో బెయిల్ మంజూరు చేయడం కోసం టార్గెట్ అవుతామేమోనని భయపడుతున్నారని అన్నారు.
Also Read : శశి థరూర్ 1919 కార్టూన్ హల్ చల్