MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదు
కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబానికి ప్రత్యేకించి కూతురు ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీకి చెందిన ఎంపీ వర్మ.
ఆమెతో పాటు ఆమెకు చెందిన కుటుంబీకులు, పీఏకు కూడా పాత్ర ఉందంటూ ఆరోపించారు. బీజేపీ చేసిన ఈ ఆరోపణలు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కల్వకుంట్ల కుటుంబంలో కలకలం రేపాయి.
దీనికి సంబంధించి సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పందించారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ లో తనకు కానీ లేదా తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ లో ఓ భాగమన్నారు. సిల్లీ పాలిటిక్స్ అంటూ కొట్టి పారేశారు కవిత. సీబీఐ దర్యాప్తులో తన పేరు బయట పడిందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వాటిలో నిజం లేదు. ఈ ఆరోపణలు ఖండిస్తున్నా. అవి పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు కవిత. కేంద్ర బీజేపీ ప్రభుత్వంలోనే అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి.
వాళ్లు ఎప్పుడైనా దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేశారు కవిత. ఈ కేసుకు సంబంధించి తాను పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పారు. దేశంలో మోదీ వైఫల్యాలను ఎండగడుతున్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ను టార్గెట్ చేసే మార్గం వాళ్లకు కనిపించడం లేదు. అందుకే తనను టార్గెట్ చేస్తూ వచ్చారని నిప్పులు చెరిగారు కవిత. తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు.
Also Read : పడగొట్టడంలో మోదీ ప్రభుత్వం టాప్