CJI Sarita Pandey : బాధితుల గోడు వినాల‌ని సీజేఐకి విన్న‌పం

అమెరికాలో ఎన్నారై స‌రితా పాండే విన‌తిప‌త్రం

CJI Sarita Pandey : భార‌త దేశంలో ఎంతో మంది త‌మ బాధ‌ను చెప్పుకోవాల‌ని అనుకుంటున్నారు. ఇంకొంద‌రు తెలియకుండానే కేసుల‌కు గుర‌వుతున్నారు. ముందు వారు ఏం చెప్పాల‌ని అనుకుంటున్నారో వారి గోడును వినాల‌ని కోరారు ప్ర‌వాస భార‌తీయురాలు (ఎన్నారై) స‌రితా పాండే.

అమెరికాలో భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా స‌రితా పాండే(CJI Sarita Pandey) వినత ప‌త్రం అంద‌జేశారు.

యుఎస్ రాజ‌ధాని వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన భార‌తీయుల అన‌ధికార స‌మావేశంలో ఆయ‌న‌ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బ‌హ‌హిరంగ లేఖ‌ను అంద‌జేశారు.

సీజేఐ ద‌య‌తో అంగీక‌రిచార‌ని, దానిని త‌ప్ప‌క చ‌దువుతాన‌ని చెప్పార‌ని స‌రితా పాండే అమెరిక‌న్ క‌హానీలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

భార‌త దేశంలో నిర‌స‌న‌లు చోటు చేసుకున్న విధంగానే అమెరికాలో సైతం ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. రో వ‌ర్సెస్ వాడే ర‌ద్దు చేయాల‌నే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణ‌యాన్ని వారు నిర‌సిస్తున్నారు.

సియాటిల్ లో కూడా ఇదే నిర‌స‌న కొన‌సాగుతోంది. ఇందులో భార‌తీయులు కూడా ఉన్నార‌ని ఆమె సీజేఐకి(Sarita Pandey) అంద‌జేసిన లేఖ‌లో పేర్కొంది.

భార‌త దేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియాతో వారు నిరుత్సాహానికి గురై వీధుల్లోకి వ‌చ్చార‌ని తెలిపారు స‌రితా పాండే. అయిన‌ప్ప‌టికీ తాము ఎప్ప‌టికీ హింస‌ను న‌మ్ము కోలేద‌ని కేవ‌లం శాంతిని మాత్ర‌మే కోరుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇవాళ నేను , గౌర‌వ నీయులైన మీరు భార‌త దేశం వెలుపల ఉన్నాం. 1.38 మిలియ‌న్ల ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను ప‌రిర‌క్షిస్తున్నారు. మీతో స్వేచ్ఛ‌గా మాట్లాడేందుకు వీలు కుదిరింద‌ని తెలిపింది.

వారెంట్ లేకుండా, లాయ‌ర్ తో మాట్లాడ నీయ‌కుండా తీస్తా సెత‌ల్వాద్ ను అరెస్ట్ చేయ‌డం క‌లిచి వేసింద‌ని వాపోయింది స‌రితా పాండే. ఆమెతో పాటు పోలీస్ అధికారి ఆర్. బి. శ్రీ‌కుమార్ అరెస్ట్ అయ్యాడు.

మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భ‌ట్ జీవిత ఖైదు అనుభ‌విస్తున్నాడ‌ని తెలిపారు. త‌న ఆవేద‌న‌ను కొంద‌రి గోడుగా వినాల‌ని ఆమె కోరింది.

Also Read : పెంట‌గాన్ పోస్ట్ కి రాధా అయ్యంగార్

In What Discourse Can We Converse With the Heartless: An Open Letter to the Chief Justice of India

Leave A Reply

Your Email Id will not be published!