Nupur Sharma : మనసు నొప్పిస్తే మన్నించండి – నూపుర్ శర్మ
మహ్మద్ ప్రవక్తపై కామెంట్స్ వెనక్కి తీసుకుంటన్నా
Nupur Sharma : భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. ఆమె మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో యూపీలో తీవ్ర దుమారం రేగింది.
కాన్పూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకునే దాకా వెళ్లింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి.
వీరిలో పోలీసులు కూడా ఉన్నారు. పార్టీకి తీవ్ర డ్యామేజ్ ఏర్పడింది. పార్టీలోని ముస్లిం శ్రేణులు, నాయకులతో పాటు దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది.
దీనిపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అనంతరం బీజేపీ క్రమశిక్షణ సంఘం పార్టీ నుంచి నూపుర్ శర్మ(Nupur Sharma)పై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం నూపుర్ శర్మ మీడియాతో మాట్లాడారు. దయచేసి నన్ను మన్నించండి. నేను కావాలని కామెంట్స్ చేయలేదు. మీ మనసు నొప్పిస్తే క్షమించండి అంటూ కోరింది.
ఎవరి మనోభావాలు దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదన్నారు. తన వ్యాఖ్యాలు ఎవరైనా బాధపడితే బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఈ మేరకు నూపుర్ శర్మ(Nupur Sharma) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా శివుడిని కొందరు అవమానిస్తూ వచ్చారని, దానిని తట్టుకోలేకే తాను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలిపారు నూపుర్ శర్మ.
తాను ఎవరినీ కించ పర్చేలా మాట్లాడ లేదని స్పష్టం చేశారు నూపుర్ శర్మ.
Also Read : ఆ కామెంట్స్ తో సంబంధం లేదు