Nupur Sharma : నూపుర్ శర్మ ఫోటో అప్ లోడ్ పై వార్నింగ్
సూరత్ లో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Nupur Sharma : భారతీయ జనతా పార్టీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆమెను తొలగించారు.
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆమెను చంపేస్తామంటూ కొందరు వార్నింగ్ కూడా ఇచ్చారు. పలు చోట్ల నూపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.
ఇదే సమయంలో గుజరాత్ లోని ఉదయ్ పూర్ లో తనకు మద్దతు తెలిపారన్న కారణంతో టైలర్ ను దారుణంగా హత్య చేశారు. ఆపై వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆపై ప్రధాన మంత్రి మోదీని కూడా బెదిరించారు. అది కలకలం రేపింది. ఆ ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. వ్యాపారవేత్త నూపుర్ శర్మ(Nupur Sharma)ఫోటో ను అప్ లోడ్ చేశాడు.
దీంతో అతడిని చంపేస్తామంటూ కొందరు బెదిరింపులకు గురి చేశారు. వారిలో ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా ఈ వ్యాపారేత్త సూరత్ లో అమ్యూజ్ మెంట్ పార్క్ నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో అప్ లోడ్ చేశారు. దీనిని గుర్తించిన కొందరు అతడికి వార్నింగ్ ఇచ్చారు. తనను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు వ్యాపారవేత్త వాపోయాడు.
పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసినట్లు ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో ఒకరు మహిళ కూడా ఉన్నారని చెప్పారు. వారిలో మహ్మద్ అయాన్ అటాష్ బాజి వాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అని ఎస్ఐ వెల్లడించారు.
Also Read : 24 బిల్లులు ప్రవేశ పెట్టనున్న కేంద్రం