NV Ramana : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ(NV Ramana )కీలక వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీజేఐ కొలువు తీరాక సుప్రీంకోర్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana )చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
పదవీ విరమణ చేసేందుకు 65 ఏళ్లు పెద్ద వయసేమీ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక విధంగా ఈ వయసు చాలా తక్కువేనని చెప్పారు.
ఇదే సమయంలో ప్రతిభకు, పని చేసేందుకు వయసు అనేది అడ్డంకి కాదని స్పష్టం చేశారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇదిలా ఉండగా న్యాయమూర్తులకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు.
ఒకసారి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యాక భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కాగా ఓ సదస్సులో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలోని భిన్న ప్రాంతాలు, సమాజంలో కనిపిస్తున్న వైవిధ్యం అన్నది ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థలో కూడా ప్రతిబింబించాలన్నది ముఖ్యమన్నారు సీజేఐ(NV Ramana ).
అప్పుడే సమర్థవంతంగా పని చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు జస్టిస్ నూతల పాటి వెంకట రమణ. ఇక ఎన్వీ రమణ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆయనకు మాతృ భాష అంటే వల్లమాలిన అభిమానం. ఆయన ఎక్కడికి వెళ్లినా తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తారు. భాషను విస్మరిస్తే ప్రమాదమన్నారు.
Also Read : రాముడి పేరుతో బీజేపీ రాజకీయం