NV Ramana : పోలీసుల ప్ర‌తిష్ట మ‌స‌క బారుతోంది

సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న కామెంట్స్

NV Ramana  : అవినీతి, ఆరోప‌ణ‌ల‌తో పోలీసుల ప్ర‌తిష్ట మ‌స‌క బారుతోందంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ‌.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) , నిష్క్రియాత్మ‌క చ‌ర్య‌లు దాని విశ్వ‌స‌నీయ‌త‌పై ప‌లు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నాయ‌ని పేర్కొన్నారు. వేధింపుల‌కు గుర‌వుతున్నామంటూ బాధితులు త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్నారంటూ తెలిపారు.

కాలంతో పాటు రాజ‌కీయ అధికారులు మారి పోతారని, మీరు మాత్రం శాశ్వ‌త‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఎన్వీ ర‌మ‌ణ‌(NV Ramana ). సామాజిక చ‌ట్ట‌బ‌ద్ద‌త , ప్ర‌జ‌ల విశ్వాసాన్ని తిర‌గి పొంద‌డం ఈ స‌మ‌యంలో అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.

రాజ‌కీయ‌, కార్య‌నిర్వాహ‌క సంబంధాలు లేకుండా ఉంటేనే ఏదైనా బాగుంటుంద‌న్నారు. ప్ర‌జాస్వామ్యం, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల పాత్ర , బాధ్య‌త‌లు అనే అంశంపై జ‌రిగిన స‌మావేశంలో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ(NV Ramana )ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

బ్రిటిష్ కాలం నుంచి భార‌త (India) దేశంలో పోలీస్ వ్య‌వ‌స్థ ఎలా అభివృద్ధి చెందిందో వివ‌రిస్తూ కాలక్ర‌మేణా సీబీఐ ప్ర‌జ‌ల లోతైన ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు.

అవినీతి, ఆరోప‌ణ‌లు ఈ మ‌ధ్య ఎక్కువ‌య్యాయ‌ని వీటిపైనే త‌మ‌కు ఫిర్యాదులు అధికంగా వ‌స్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏ సంస్థ అయినా త‌మ నాయ‌క‌త్వంపైనే ఆధార‌ప‌డి దాని మ‌నుగ‌డ ఉంటుంద‌న్నారు.

కేవ‌లం కొద్ది మంది అధికారులే మార్పు తీసుకు రాగ‌ల‌ర‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌. ఇదిలా ఉండ‌గా సుప్రీంకోర్టులో (Supreme court) జ‌స్టిస్ ర‌మ‌ణ కొలువు తీరాక ప‌లు మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఆయ‌న ప‌దే ప‌దే విలువ‌ల గురించి చెబుతూ వ‌స్తున్నారు.

Also Read : ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అవ‌స‌రం – లావ్ రోవ్

Leave A Reply

Your Email Id will not be published!