Obaidullah Aleem Poet : ఎవ‌రీ ఒబైదుల్లా అలీమ్

పాకిస్తాన్ లో పేరొందిన క‌వి

భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిన్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ నోట పాకిస్తాన్ కు చెందిన క‌వి మాట రావ‌డం విస్తు పోయేలా చేసింది. ఇంత‌కూ ఆ క‌విరేణ్యుడు ఎవ‌రో కాదు త‌న క‌విత్వంతో, ర‌చ‌న‌ల‌తో సాహిత్యాన్ని సుసంప‌న్నం చేసిన ఒబైదుల్లా అలీమ్. ఉర్దూ భాష‌కు చెందిన పాకిస్తానీ క‌వి.

ఒబైదుల్లా అలీమ్ భార‌త దేశంలోని భోపాల్ లో 1939లో పుట్టాడు. దేశ విభ‌జ‌న త‌ర్వాత అలీమ్ తండ్రి పాకిస్తాన్ లోని సియాల్ కోట్ కు మారారు. ఒబైదుల్లా అలీమ్ కాశ్మీరీ భ‌ట్ కుటుంబానికి చెందిన వాడు. క‌రాచీ విశ్వ విద్యాల‌యం నుండి ఉర్దూలో ఎంఏ ప‌ట్టా పొందాడు. 1967 వ‌ర‌కు రేడియో, టెలివిజ‌న్ నిర్మాత‌గా ప‌ని చేశాడు. 1974లో చంద్ చెహ్రా సితార్ అంఖేన్ పేరుతో త‌న తొలి క‌వితా పుస్త‌కాన్ని ప్ర‌చురిత‌మైంది. క‌రాచీ స్టేష‌న్ పాకిస్తాన్ టెలివిజ‌న్ కార్పొరేష‌న్ లో సీనియ‌ర్ నిర్మాత‌గా గుర్తింపు పొందాడు.

1978లో ఆయ‌న అనుకోని రీతిలో రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఒబైదుల్లా అలీమ్ రాసిన పుస్త‌కానికి సాహిత్యంలో అత్యున్న‌త‌మైన పుర‌స్కారం ఆడ‌మ్ జీ అవార్డును అందుకున్నాడు. 1982లో ఖ‌లీఫ‌తుల్ మ‌సీహ్ -3 జ్ఞాప‌కార్థం ఖుర్షీద్ మిస్స‌ల్ షాఖ్స్ అనే వ్యాసం రాశాడు. రెండో క‌వితా సంక‌ల‌నం విరాన్ స‌రాయ్ కా దియా 1986లో ప్ర‌చురించ‌బ‌డింది. చిరాగ్ జ‌ల్తే హెన్ . ది అన్ ప‌బ్లిష్డ్ పోయెట్రీ ఆఫ్ ఒబైదుల్లా అలీమ్ పేరుతో ప్ర‌చురించారు. అలీమ్ చివ‌ర‌కు 18 మే 1998న గుండె పోటుతో తుది శ్వాస విడిచాడు.

Leave A Reply

Your Email Id will not be published!