Odisha CM Navin Patnaik : ఘటనపై ఆరా బాధితులకు భరోసా
ఘటన స్థలాన్ని సందర్శించిన సీఎం
Odisha CM Navin Patnaik : ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పటి వరకు అధికారికంగా పూర్తి స్థాయిలో చని పోయిన వారి సంఖ్య రాలేదు. కానీ ప్రాథమిక అంచనా ప్రకారం 238 మందికి పైగానే చని పోయినట్లు సమాచారం. 1,000 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చుట్టు పక్కల ఆస్పత్రులకు తరలించారు. శనివారం ఘటనా స్థలాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(Odisha CM Navin Patnaik) సందర్శించారు.
ఈ సందర్బంగా బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. మరో వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలలో నిమగ్నమయ్యాయి. ఇవాళ ఆయన ఘటనా స్థలం నుంచి నేరుగా బాలా సోర్ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులు ఒక్కరొక్కరిని పరామర్శించారు. బెంగళూరు హౌరా ఎక్స్ ప్రెస్ , షాలిమార్ చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు బాలా సోర్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్నాయి. ఈ ఘటన కేవలం మూడు నిమిషాల్లోపే చోటు చేసుకుంది. బోగీలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
ఇంకా రెస్క్యూ టీమ్స్ పని చేస్తున్నాయి. దీంతో రైళ్ల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మార్గం ద్వారా వెళ్లే 48 రైళ్లను రద్దు చేసింది కేంద్ర రైల్వే శాఖ. 39 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. ఈ ఘటనలో మృతి చెందిన వారికి తమిళనాడు ప్రభుత్వం రూ. 5 లక్షలు గాయపడిన వారికి రూ. 1లక్ష ప్రకటించింది. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ వెల్లడించారు.
Also Read : CM MK Stalin