Giridhar Gamang : బీజేపీకి షాక్ ఒడిశా మాజీ సీఎం గుడ్ బై
పార్టీకి రాజీనామా చేసిన గిరిధర్ గమాంగ్
Giridhar Gamang : ఒడిశాలో భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక రకంగా పెద్ద దెబ్బ. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాకు పంపించారు. ఆయన త్వరలోనే కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు సమాచారం. అపారమైన రాజకీయ అనుభం కలిగిన నాయకుడిగా గిరిధర్ గమాంగ్ కు పేరుంది. ఆయన సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
2015లో ఆ పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీఈలో చేరారు. తాజాగా తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. కోలుకోలేని దెబ్బ కొట్టారు కాషాయ పార్టీకి. ఇటీవలే శిశిర్ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు.
ఇదిలా ఉండగా గిరిధర్ గమాంగ్ కు (Giridhar Gamang) ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఒడిశాలో. ఆయన అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. ఆ తర్వాత సీఎంగా కూడా పని చేశారు. 9 సార్లు పార్లమెంట్ కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఒడిశా రాజకీయాలలోనే కాదు దేశ రాజకీయాలలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు గిరిధర్ గమాంగ్.
ఆయన 1972 నుంచి 2004 దాకా కోరా పుట్ , లక్ష్మీ పూర్ స్థానాల నుంచి లోక్ సభ కు ఎంపికయ్యారు. 10 నెలల పాటు ఒడిశాకు సీఎంగా పని చేశారు. ఉన్నది కొద్ది కాలమే అయినా గిరిధర్ గమాంగ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read : నాగాలాండ్ ఆప్ చీఫ్ గా అసు కీహో