Oklahoma Shooting : యుఎస్ లో కాల్పులు నలుగురు మృతి
ఓక్లహోమా ఆస్పత్రి క్యాంపస్ లో ఘటన
Oklahoma Shooting : అమెరికాలో కాల్పుల మోత ఆగడం లేదు. ఇటీవలే 19 మంది పిల్లలపై కాల్పుల ఘటన మరిచి పోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. యుఎస్ లోని ఓక్లహోమాలోని హాస్పిటల్ క్యాంపస్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులకు తెగ బడ్డాడు దుండగుడు. కాల్పులకు పాల్పడిన దుండగుడు సైతం చని పోయాడు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.
ఓక్లాహోమాలోని(Oklahoma Shooting) తుల్సా ఆస్పత్రి క్యాంపస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ముష్కరుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. వారం రోజుల కిందట టెక్సాస్ స్కూల్ లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 19 మంది పిల్లలు మరణించారు.
ఆ ఘటన మరిచి పోక ముందే తాజా ఘటన మరింత కలకలం రేపింది. సెయింట్ ఫ్రాన్సిస్ హెల్త్ సిస్టమ్ హాస్పిటల్ క్యాంపస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ దాడిలో రైఫిల్, హ్యాండ్ గన్ తో ఆయుధాలు కలిగి ఉన్న నిందితుడు కూడా మరణించాడని పోలీసులు వెల్లడించారు. దుండగుడితో పాటు మరో ముగ్గురు చని పోయారు.
ఇది దుండగుడి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇది స్వయం ప్రేరేపితమని తాము నమ్ముతున్నట్లు తుల్సా పోలీస్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ చీఫ్ ఎరిక్ డాల్గ్లీష్ చెప్పారు. సెయింట్ ఫ్రాన్సిస్ కు అనుబంధంగా ఉన్న క్లినిక్ లోని రెండవ అంతస్తుకు షూటర్ చేరుకున్నాడు.
దీంతో ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయి. వెంటనే పోలీసులు స్పందించారని తెలిపారు. కాగా పలువురికి గాయాలైనట్లు కూడా తెలిసింది. తుల్సా కాల్పుల(Oklahoma Shooting)పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు వివరించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.
Also Read : ఉక్రెయిన్ కు అధునాతన రాకెట్లు – బైడెన్