Veerabhadra Swamy : ఏపీ డిప్యూటీ స్పీకర్ గా వీరభద్రస్వామి
ఏకగ్రీవంగా ఎన్నుకున్న శాసనసభ
Veerabhadra Swamy : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి (డిప్యూటీ స్పీకర్) గా కోలగట్ల వీరభద్రస్వామి(Veerabhadra Swamy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీకి చెందిన విజయనగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటన చేసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరభద్ర స్వామి వద్దకు చేరుకుని నమస్కారం చేశారు.
సీఎంతో పాటు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, టీడీపీ ఎమ్మెల్యే అచ్చన్నాయుడు వీరభద్రస్వామిని స్వయంగా తీసుకు వెళ్లి స్పీకర్ సీటుపై కూర్చోబెట్టారు.
ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 2019, 2004లో శాసనసభకు , శాసన మండలికి ఎన్నికయ్యారు కోలగట్ల వీరభద్ర స్వామి.
ఎంతో నిబద్దతతో పార్టీ కోసం, నియోజకవర్గ ప్రజల కోసం పని చేశారని కితాబు ఇచ్చారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. కె. రఘుపతి స్థానంలో వీరభద్ర స్వామిని నియమించడం జరిగిందన్నారు.
సభను నిర్వహించడంలో ఆయన పని చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు జగన్ రెడ్డి. సామాజిక సమీకరణలను కూడా ఇందులో పని చేశాయి.
కాగా ఏకగ్రీవంగా ఉప సభాపతిగా ఆసీనులైన కోలగట్ల వీరభద్ర స్వామి(Veerabhadra Swamy) సభను ఉద్దేశించి ప్రసంగించారు. తనపై నమ్మకం ఉంచి సభ్యులంతా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు.
సభా మర్యాదాలను కాపాడుతానని, ప్రతి ఒక్కరికీ మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని చెప్పారు. సభ్యులు విలువైన సమయాన్ని వాడుకోవాలని ఆదర్శంగా నిలవాలని కోరారు.
Also Read : ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు