Om Birla : స్వేచ్ఛపై పహరా లేదన్న ఓం బిర్లా
విపక్షాల ధ్వజం స్పందించిన స్పీకర్
Om Birla : పార్లమెంట్ లో ఎంపీలు ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడ కూడదోననే విషయంపై కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ తీసుకు వచ్చిన ప్రవర్తనా నియమావళి బుక్ లెట్ పై తీవ్ర దుమారం రేగింది.
దీంతో ఎట్టకేలకు స్పీకర్ ఓం బిర్లా(Om Birla) స్పందించారు. కేంద్రం అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. దేశ వ్యాప్తంగా ఎంపీలు మండిపడ్డారు. రాచరిక పాలనకు ఇది పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, టీఎంసీ ఎంపీలు డెరిక్ ఓ బ్రెయిన్ , మహూవా మోయిత్రాతో పాటు శివసేన పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీ జై రాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తాను మాత్రమే సుప్రీం అనుకుంటూ దేశాన్ని సర్వ నాశనం చేస్తున్న ప్రధాన మంత్రి మోదీ(PM Modi) నిర్వాకానికి ఎంపీల మాట్లాడటంపై ప్రవర్తనా నియమావళి పేరుతో బుక్ లెట్ తీసుకు రావడం, దానిని గొప్పగా చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరికొందరు తమ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు పార్లమెంట్ కు లేనే లేదంటూ స్పష్టం చేశారు.
ఈ మేరకు కోర్టుకు వెళతామని హెచ్చరిస్తున్నారు. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) స్పందించారు. అన్ పార్లమెంటరీ పదాల జాబితా పై స్పష్టత ఇచ్చారు.
ఎలాంటి పదాలపై నిషేధం విధించ లేదన్నారు. కొన్ని పదాలను తొలగించామని, వాటితో మాత్రమే జారీ చేశామన్నారు.
Also Read : ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్