Om Prakash Rajbhar : ద్రౌపది ముర్ముకు రాజ్ భర్ మద్దతు
అఖిలేష్ యాదవ్ కు బిగ్ షాక్
Om Prakash Rajbhar : దేశ వ్యాప్తంగా ఈనెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ జాతికి చెందిన ద్రౌపది ముర్మును(Draupadi Murmu) ఎంపిక చేసింది.
ఇదే సమయంలో ప్రతిపక్షాలన్నీ కలిసి తమ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా అపారమైన రాజకీయ అనుభవం కలిగిన యశ్వంత్ సిన్హాను నిలిపింది. ఇద్దరూ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
ఇక విపక్ష పార్టీలలో సమాజ్ వాది పార్టీతో పాటు శివసేన కూడా ఉంది. కానీ మరాఠాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో శివసేన భాగంగా ఉన్న మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలి పోయింది.
ఊహించని రీతిలో యశ్వంత్ సిన్హాకు కాకుండా శివసేన ఎంపీలు బీజేపీ కి చెందిన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడం కలకలం రేపింది. దీనిపై కేంద్రం ఉద్దవ్ ఠాక్రేను భయ పెట్టిందని ఆరోపించారు సిన్హా.
ఇదిలా ఉండగా సమాజ్ వాది పార్టీతో పొత్తు కుదుర్చుకున్న సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్ భర్ ఊహించని రీతిలో అఖిలేష్ యాదవ్ కు షాక్ ఇచ్చారు.
శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తాము బేషరతుగా ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ముకు మద్ధతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ద్రౌపది ముర్ము తనకు మద్దతు ఇవ్వాలని రాజ్ భర్ ను కోరారు.
ఉన్నట్టుండి ఓం ప్రకాష్ రాజ్ భర్(Om Prakash Rajbhar) యూ టర్న్ తీసుకోవడం కలకలం రేగింది.
Also Read : ఉద్దవ్ ఠాక్రేపై కేంద్రం బలవంతం – సిన్హా