Omar Abdullah : ఎన్వీ రమణపై ఒమర్ అబ్దుల్లా ఫైర్
370 ఆర్టికల్ పై తీర్పు ఇవ్వలేదు
Omar Abdullah : మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ(NV Ramana) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్ లీడర్ ఒమర్ అబ్దుల్లా.
16 నెలల పాటు సీజేఐగా కొలువు తీరిన జస్టిస్ రమణ ఆర్టికల్ 370 పై(Article 370) తమ అభ్యర్థనను పరిశీలించకుండానే పదవీ విరమణ చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఒబర్ అబ్దుల్లాతో పాటు పలు ప్రధాన పార్టీలు ఈ చర్యను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆర్టికల్ 370 అభ్యర్థనను కావాలనే పరిగణలోకి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) .
ఇదిలా ఉండగా 48వ ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరిన ఎన్వీ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేశారు. ఆయన రిటైర్మెంట్ అయిన రెండు రోజుల తర్వాత కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎస్సీ) పార్టీకి ఒమర్ అబ్దుల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ కావాలనే ఆర్టికల్ 370 రద్దు గురించి కోర్టులో హియరింగ్ కు రాకుండా చూశారని, ఇది ఒక రకంగా తెలివిగా తాను తప్పించు కున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఒమర్ అబ్దుల్లా.
వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఆర్టికల్ రద్దు విషయంలో ఆయా పార్టీలు దాఖలు చేసిన దావాలపై సుప్రీంకోర్టు విచారిస్తుందని స్పష్టం చేశారు రిటైర్డ్ సీజేఐ ఎన్వీ రమణ.
దీనిని ప్రశ్నిస్తూ ప్రచురితమైన కథనాన్ని ఉదహరించారు ఒమర్ అబ్దుల్లా. ప్రస్తుతం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు మోదీ(PM Modi). అందుకే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతోందన్నారు.
Also Read : మానని గాయం ‘స్మృతి వాన్’ కు సలాం