Rajani Vidudala : ఎవరీ విడుదల రజని అనుకుంటున్నారు. ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కొత్త కేబినెట్ లో ఆమెకు చోటు దక్కింది. దీంతో తెలుగు రాజకీయాలలో చర్చ నీయాంశంగా మారింది.
ఆమె ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయంగా ఉండనుంది. ఈసారి కేబినెట్ లో విశేషం ఏమిటంటే బహుజనులకు ప్రయారిటీ ఇవ్వడం.
అంతే కాదు నలుగురు మహిళలకు చోటు కల్పించారు మొత్తం కేబినెట్ 25 మందిలో. ప్రస్తుతం బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు ప్రయారిటీ ఇచ్చారు.
కొత్తగా కొలువు తీరిన మంత్రివర్గంలో అత్యంత పిన్న వయసు కలిగిన ఏకైక మంత్రి మాత్రం విడుదల రజని(Rajani Vidudala). సవాళ్లను ఎదుర్కొంటూ తనను తాను నాయకురాలిగా ఎదిగింది రజని.
ఆమె ఉన్నత విద్యావంతురాలు. మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ గా పేరొందారు. ఆమె వయసు 32 ఏళ్లు. తక్కువ కాలంలో విడుదల రజని పాపులర్ నాయకురాలిగా ఎదిగారు.
ఇక సామాజిక మాధ్యమాలలో వేలాది మంది అభిమానులు ఉన్నారు. విచిత్రం ఏమిటంటే రజనిది స్వస్థలం ఏపీ కాదు. అచ్చమైన తెలంగాణ. రజని హైదరాబాద్ లో 24-06-1990లో పుట్టారు.
ఓయూలో బీఎస్సీ చేశారు. ఎంబీఏ చదివారు. ఐటీ కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార స్వామితో పెళ్లి జరగడంతో ఏపీలో ఎంటరైంది.
ప్రస్తుతం మంత్రిగా కొలువుతీరారు విడుదల రజని(Rajani Vidudala). ఆమె మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరుకుందాం.
Also Read : ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా