Bridge Collapse: బిహార్‌లో కుంగిన వంతెన ! పది రోజుల వ్యవధిలో నాల్గో ఘటన !

బిహార్‌లో కుంగిన వంతెన ! పది రోజుల వ్యవధిలో నాల్గో ఘటన !

Bridge Collapse: బిహార్‌లో వరుస వంతెన ప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా కిషన్‌ గంజ్‌ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ వంతెన కుంగిపోయింది. దీనితో బహదుర్‌గంజ్‌, దిఘాల్‌బ్యాంక్‌ బ్లాక్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 10 రోజుల వ్యవధిలో ఇది నాల్గో ఘటన కావడం గమనార్హం.

Bridge Collapse in Bihar..

‘‘కంకయీ, మహానంద నదులను కలిపే మడియా ఉపనదిపై 2011లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించారు. నేపాల్‌లోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రవాహం ధాటికి వంతెన పిల్లర్లు కుంగిపోయాయి’ అని జిల్లా మెజిస్ట్రేట్‌ తుషార్‌ సింగ్లా తెలిపారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలను నిలిపివేసినట్లు చెప్పారు. రహదారుల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంతకుముందు తూర్పు చంపారన్‌, సివాన్‌, అరారియా జిల్లాల్లో వంతెన సంబంధిత ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పది రోజుల వ్యవధిలోనే రాష్ర్టంలో నాలుగు వంతెనలు కూలిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Minister Kollu Ravindra : అధికారుల్లో గుబులు పుట్టిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

Leave A Reply

Your Email Id will not be published!