One Nation One Election : వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమేనా
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం
One Nation One Election : భారత దేశం భిన్నమైన సంస్కృతులకు, కులాలకు, మతాలకు , ప్రాంతాలకు నెలవైంది. ఎవరి అభిప్రాయాలు వారివి. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించబడింది. ఇది పక్కన పెడితే కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గత కొంత కాలం నుంచీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ (ఒకే దేశం ఒకే ఎన్నికలు) గా ఉండాలన్నది తమ లక్ష్యమంటూ ప్రకటిస్తూ వస్తోంది.
ఎందుకు వేర్వేరుగా ఉండాలన్నది బీజేపీ లేవదీస్తున్న ప్రశ్న. దీనిని ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఇప్పటికే దేశంలో హిందువులు కాకుండా ఉన్న ఇతరులు బతికే పరిస్థితులు లేవని వాపోతున్నారు. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే తాము చేసి తీరుతామంటూ ప్రకటించారు పీఎం నరేంద్ర మోదీ(PM Modi). ఇది సాధ్యమయ్యే పనేనా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారి పోయింది.
One Nation One Election Viral
1967 దాకా భారత దేశంలో ప్రబలంగా ఉన్న ఎన్నికల విధానాన్ని సమూలంగా మార్పు చేయాలన్న సత్ సంకల్పం కలిగి ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు ప్రధాని మోదీ(PM Modi). ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న భావనను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీని వల్ల దేశంలో ఎన్నికలతో పాటు రాజకీయాలు కూడా సుస్థిరంగా ఉంటాయని భావిస్తున్నారు మోదీ. ఒకేసారి ఏక కాలంలో రాష్ట్రాలలో, దేశ మంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పారదర్శకత కూడా ఉంటుందన్నారు.
ఇలా చేపట్టడం వల్ల సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని పీఎం భావిస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజా ధనం ఖర్వచుతోంది. కాంగ్రెస్ హయాంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు ఉన్నంత వరకు బాగానే ఉంది. కానీ మారుతున్న రాజకీయ సమీకరణలు, పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం పలు పార్టీలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల్లో గతంలో కంటే ఇప్పుడు రాజకీయ చైతన్యం పెరిగింది.
ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాలలో అనూహ్యంగా ఆయా ప్రభుత్వాలు కూలి పోయాయి. మరికొన్ని అర్ధాంతరంగా తొలగింపునకు లోనయ్యాయి. కేంద్రం కనుసన్నలలో పవర్స్ ఉండడం కూడా ఇందుకు దోహద పడిందన్న అపవాదు కూడా లేక పోలేదు. తాజాగా కేంద్రం ఈ మేరకు వన్ ఎలక్షన్ వన్ నేషన్ కు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టనుంది మోదీ(PM Modi) ప్రభుత్వం. ఈ మేరకు కీలక ప్రకటన కూడా చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తుంది.
పైకి ఎంత గొప్పగా ఉన్నా కాన్సెప్ట్ ఆచరణలోకి రావాలంటే పలు అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. 83(2) ఆర్టికల్ ప్రకారం లోక్ సభ పదవీ కాలం 5 ఏళ్లకు మించి ఉండకూదు. ఆర్టికల్ 172(1)ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ త్వరగా రద్దు అయితే తప్పా నిర్వహించేందుకు వీలు పడదు. ఆర్టికల్ 174(2) (బి) ప్రకారం మంత్రివర్గం సలహాతో అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 356 విషయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు.
ఇక రాజ్యాంగ సవరణ చేయాలంటే సభలో మూడింట రెండు వంతుల సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం ముఖ్యం. సగం రాష్ట్రాలు తమ అసెంబ్లీలలో తీర్మానాల ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా అయ్యే పనేనా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : Bandi Sanjay : హిందువులారా ఇకనైనా మేల్కోండి