TREIRB JOBS : ఒక్క‌సారి రిజిస్ట్రేష‌న్ చేసుకుంటే చాలు

టీఎస్పీఎస్సీ త‌ర‌హాలో ట్రిబ్ జాబ్స్

TREIRB JOBS : తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌హ‌స‌నంగా మారింది. ఇప్ప‌టికే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో చోటు చేసుకున్న పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం ఇంకా కొలిక్కి రాలేదు. అంత లోనే గురుకులాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ జారీ చేసింది ప్ర‌త్యేక బోర్డు. కీల‌క మార్పులు చేసింది. టీఎస్పీఎస్సీ త‌రహాలోనే ఒక్క‌సారి రిజిస్ట్రేష‌న్ చేసుకునే స‌దుపాయాన్ని తీసుకు వ‌చ్చిన‌ట్లు సంస్థ కార్య‌ద‌ర్శి మ‌ల్ల‌య్య భ‌ట్టు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతానికి గురుకుల విద్యా సంస్థ‌ల్లో బోధ‌న పోస్టు భ‌ర్తీకి నియామ‌క బోర్డు ఓటీఆర్ ను తీసుకు వ‌చ్చింది. దీని ద్వారా అర్హులైన అభ్య‌ర్థులు అర్హ‌త క‌లిగిన పోస్టుల‌కు నేరుగా ద‌ర‌ఖాస్తు(TREIRB JOBS) చేసుకునే వీలు క‌లుగుతుంది. ఒక్కో పోస్టుకు నెల రోజుల గ‌డువు ఇచ్చింది బోర్డు. గురుకులాల్లో మొత్తం 9,231 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకునే ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

అభ్య‌ర్థుల‌కు అనువుగా ఉండేలా ట్రిబ్ మార్పులు చేసింది. ఎలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు భ‌ట్టు. ఓటీఆర్ వ‌ల్ల ప్ర‌తిసారి స‌ర్టిఫికెట్లు న‌మోదు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ఏప్రిల్ 17 నుంచి గురుకుల డిగ్రీ, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ ఉద్యోగాల‌కు, 24 నుంచి పీజీటీ, స్కూల్ లైబ్రేరియ‌న్ , పీడీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ , మ్యూజిక్ టీచ‌ర్ల‌కు, 28 నుంచి టీజీటీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల స‌మ‌యం ఆదా అవుతుంద‌ని పేర్కొన్నారు కార్య‌ద‌ర్శి.

Also Read : ఎన్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!