Opposition Leaders : ఈసీపై సుప్రీం తీర్పు సూపర్
ప్రశంసించిన ప్రతిపక్షాలు
Opposition Leaders SC Orders : ఇవాళ దేశానికి శుభదినం అని పేర్కొన్నాయి ప్రతిపక్షాలు. దేశంలోని ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం ఒంటెద్దు పోకడ కుదరదని తేల్చి చెప్పింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. గురువారం కీలక తీర్పు చెప్పింది. మోదీ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
దేశంలోని అత్యున్నత ఎన్నికల సంఘానికి సంబంధించిన నియామకాలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత దేశ సర్వోన్నత న్యాయమూర్తి (సీజేఐ) తో కూడిన ప్యానెల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనరర్లను(SC Orders) నియమించాలని రాష్ట్రపతికి సలహా ఇస్తుంందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛతను కాపాడు కోవడం అత్యంత ముఖ్యమని పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ఎంపీలు స్పందించారు. అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు మోదీ ఒంటెద్దు పోకడకు, సర్కార్ కు చెంప పెట్టు(Opposition Leaders SC Orders అని పేర్కొన్నారు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ . మరో వైపు శివసేన బాల్ ఠాక్రే పార్టీకి చెందిన ఉద్దవ్ ఠాక్రే వర్గం ఇది చారిత్రాత్మకమని పేర్కొంది. రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరింత నమ్మకాన్ని పెంచేలా చేసిందన్నారు. కేంద్ర సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు.
Also Read : సుప్రీం నిర్ణయం శిరోధార్యం – అదానీ