Imran Khan : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రారంభమైంది. వాయిదా పడుతూ వస్తోంది. దీనిపై తీవ్రంగా మండిపడ్డాయి విపక్షాలు. కావాలని వాయిదా వేసేలా పీఎం ఇమ్రాన్ ఖాన్ (Imran Khan )ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.
342 సీట్ల అసెంబ్లీలో తమకు 172 సీట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దీనికి కోరమ్ పావు వంతు సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఏర్పాటైన నాటి నుంచి అంటే 1948 నుంచి నేటి దాకా ఏ ఒక్క ప్రధాన మంత్రి నాలుగు ఏళ్ల పాటు పూర్తి కాలం పని చేసిన దాఖలాలు లేవు.
ఇదిలా ఉండగా అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన తొలి ప్రధానిగా పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ త(Imran Khan )న రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన సవాలును ఎదుర్కొన్నారు.
కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సిన కీలకమైన సెషన్ కోసం సమావేశమైన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ గంటన్నరకు పైగా వాయిదా పడింది.
అయితే విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ సభలో లేరు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఈనెల ప్రారంభంలో అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయింది.
అధికార పార్టీకి చెందిన కొందరు సభ్యులు విపక్షాలకు మద్దతు పలకడం కలకలం రేగింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని ఉద్ధేశించి ప్రసంగించారు.
ప్రజలు శాంతియుతంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. విదేశీ శక్తులు కావాలనే తనను దించేందుకు యత్నిస్తున్నారంటూ ఇమ్రాన్ ఆరోపించడం విశేషం.
Also Read : భారత్ పై ఆంక్షలు విధించ లేదు