KCR : ఈ మధ్య బీజేపీని, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ దేశంలో కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ ప్రకటిస్తూ వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్(KCR )కు కోలుకోలేని షాక్ తగిలింది.
ఆయనను మినహాయిస్తూ 13 పార్టీల విపక్షాలు ఓ ప్రకటనను సంయుక్తంగా విడుదల చేశాయి. దీంతో ఆయనకు గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ నాయకులు సోనియా గాంధీ, శరద్ పవార్ , మమతా బెనర్జీ పేరుతో సంయుక్త ప్రకటన విడుదలైంది.
దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షలపై నీళ్లు చల్లడమే కాకుడా ప్రతిపక్ష శ్రేణుల్లో చీలికను ఈ సందర్భంగా బయట పెట్టింది. ఇదే సమయంలో ఆయన ఇటీవల ఢిల్లీలో ధర్నా చేపట్టారు.
ఈ మీటింగ్ కు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విరుచుకు పడ్డారు మోదీపై. ఆపై హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో సైతం నిప్పులు చెరిగారు.
కాగా సీఎం కేసీఆర్(KCR )ను చేర్చుకోకుండా 13 పార్టీలు కలిసి ఓ ఉమ్మడి ప్రకటన చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న మత హింసాత్మక ఘటనలపై ప్రతిపక్ష నేతలు ఉమ్మడి ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా టీడీపీ, జనతాదళ్ నాయకులు చంద్రబాబు నాయుడు, దేవెగౌడ గతంలో జాతీయ రాజకీయాలలో చురుకుగా ఉన్నప్పటికీ వారిని చేర్చక పోవడం గమనార్హం.
ఇదే సమయంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తుందన్నారు. తాము టీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు.
Also Read : బండిది ప్రజా వంచన యాత్ర – కేటీఆర్