LIC SBI Parliament : పార్లమెంట్ లో ఎల్ఐసీ..ఎస్బీఐపై రచ్చ
అదానీ గ్రూప్ లో 1 శాతం వాటా
LIC SBI Parliament : పార్లమెంట్ దద్దరిల్లింది. సభ్యుల ప్రశ్నలతో కేంద్ర సర్కార్ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. బిలియనీర్ గౌతమ్ అదానీ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని నిలదీశారు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.
ఇదే సమయంలో భారతీయ జీవిత భీమా సంస్థ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయి(LIC SBI Parliament) . ఎవరిని అడిగి ఈ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయంటూ ప్రశ్నించారు ఎంపీలు. దీని వెనుక ఎవరి హస్తం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా కోట్లాది మంది దాచుకున్న డబ్బులను ఎల్ఐసీ ఇలా ఎలా ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెడుతుందంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ కు సంబంధించిన ఈక్విటీలో ఒక శాతం వాటా , రుణంలో ఎల్ఐసీ ఉందని కేంద్ర సర్కార్ పార్లమెంట్ కు తెలిపింది.
ఎస్బీఐ, ఎల్ఐసీలను అదానీ గ్రూప్ బహిర్గతం చేయడంపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. విచిత్రం ఏమిటంటే ఈక్విటీ, డెట్ రెండింటి లోనూ ఒక శాతం కంటే తక్కువ వాటాను కలిగి ఉందని మంగళవారం ప్రభుత్వం స్పష్టం చేసింది.
హిండెన్ బర్గ్ కొట్టిన దెబ్బకు అదానీ గ్రూప్ భారీ ఎత్తున నష్ట పోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో 2వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఉన్నట్టుండి 22వ స్థానానికి దిగజారాడు. ఈ మొత్తం పడి పోవడానికి ప్రధాన కారణం అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ గ్రూప్ వెల్లడించిన నివేదిక. దీంతో షేర్లు దారుణంగా పడి పోయాయి.
Also Read : మోదీ పాలనలోనే ఎదిగిన అదానీ