BS Yediyurappa : అవినీతి కేసులో యెడ్డీపై విచారణకు ఆదేశం
మాజీ సీఎంతో పాటు మరికొందరు నేతలకు షాక్
BS Yediyurappa : కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడియూరప్పకు(BS Yediyurappa) కోలుకోలేని షాక్ తగిలింది. అవినీతికి సంబంధించిన కేసులో మాజీ సీఎంతో పాటు మరికొందరిపై విచారణకు కోర్టు ఆదేశించింది.
బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ కాంట్రాక్టులను మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా లంచాలు పొందారని అప్పటి సీఎం యెడియూరప్పతో పాటు కుటుంబీకులపై ఫిర్యాదు దాఖలైంది.
ఈ మేరకు కోర్టు విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా కోర్టు విచారణకు ఆదేశించడంపై మాజీ సీఎం యెడియూరప్ప స్పందించారు.
తనపై కావాలని ఏదో కుట్ర జరుగుతుందోన్న అనుమానం వ్యక్తం చేశారు.యెడ్డీతో పాటు కుటుంబీకులు అవినీతికి పాల్పడ్డారంటూ పిటిషన్ దాఖలైంది.
ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 7న కర్ణాటక హైకోర్టు అవినీతి ఫిర్యాదును మళ్లీ విచారించాలని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది.
ఈ ఆదేశాలు వచ్చిన వారం రోజుల తర్వాత ఈ ఉత్తర్వు రావడం కలకలం రేపుతోంది కన్నడ నాట. ఫిర్యాదుదారు టీజే అబ్రహంకు అనుమతి
ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించడంతో దిగువ కోర్టు జూలై 8న ఫిర్యాదును కొట్టి వేసింది.
కాగా గవర్నర్ నుండి అనుమతి పొందేందుకు ఫిర్యాదుదారుకు సమర్థ అధికారం లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. కాగా ఈ ఉత్తర్వులపై యెడియూరప్ప(BS Yediyurappa) స్పందిస్తూ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.
ఈ ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజం లేదని స్పష్టం చేశారు. వీటన్నింటి నుంచి తాను బయటకు వస్తానని చెప్పారు. తనపై ఏదైనా కుట్ర జరిగిందా అన్న
ప్రశ్నకు కచ్చితంగా అని పేర్కొనడం విశేషం.
యెడ్డీతో పాటు తనయుడు విజయేంద్ర, మనవడు శశిధర్ మారడి, అల్లుడు సంజయ్ శ్రీ, వ్యాపారవేత్త చంద్రకాంత్ రామలింగం, ఆనాటి బీడీఏ చైర్
పర్సన్ ఎస్టి సోమశేఖర్ (ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు) , ఐఏఎస్ అధికారి ప్రకాశ్ , కేరవి, విరూపాక్షప్ప లపై ఫిర్యాదులు ఉన్నాయి.
Also Read : అమిత్ షాపై ఎంకే స్టాలిన్ కన్నెర్ర