Uttarakhand CM : అక్ర‌మ రిసార్ట్స్ పై విచార‌ణ‌కు ఆదేశం – సీఎం

యువ‌కుడి మృతిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

Uttarakhand CM : ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో చ‌ట్ట విరుద్దంగా నిర్వ‌హిస్తున్న రిసార్ట్స్ కార్య‌క‌లాపాల‌పై విచార‌ణ‌కు ఆదేశించారు.

అంకితా భండారీ అనే యువ‌కుడు ఓ రిసార్ట్ లో దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. ఇందుకు సంబంధించి ఎవ‌రికి చెందిన రిసార్ట్స్ అయినా స‌రే వెంట‌నే దాడులు జ‌ర‌పాల‌ని, సోదాలు చేప‌ట్టి విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు సీఎం ధామి(Uttarakhand CM).

ఇలాంటి నేరాలు భ‌విష్య‌త్తులో జ‌రగ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. భండారీ హ‌త్య నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క రిసార్ట్ ను విచారించాల‌ని జిల్లా మేజిస్ట్రేట‌లను ఆదేశించారు సీఎం పుష్క‌ర్ సింగ్ ధామీ.

ప్ర‌స్తుతం ఉన్న రిసార్ట్స్ ల‌త‌లో పాటు అక్ర‌మంగా , ఎలాంటి ప‌ర్మిష‌న్లు లేకుండా నిర్వ‌హిస్తున్న రిసార్ట్ ల‌పై చ‌ర్య‌లు తీసుకునేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఇది దుర‌దృష్ట‌క‌రం. పోలీసులు ప‌ని చేస్తున్నారు. అరెస్ట్ లు చేయ‌డంలో వారు త‌మ ప‌నిని పూర్తి చేశారు. అటువంటి క్రూర‌మైన నేరాల‌కు, నేర‌స్థులు ఎవ‌రైన‌ప్ప‌టికీ క‌ఠినంగా శిక్ష‌కు గురికాక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు పుష్క‌ర్ సింగ్ ధామి(Uttarakhand CM).

ఆరు రోజుల కింద‌ట అదృశ్య‌మైన అంకితా భండారీని హ‌త్య చేసిన కేసులో రిసార్ట్ య‌జ‌మాని పుల్కిత్ ఆర్య‌తో స‌హా మ‌రో ముగ్గురిని అరెస్ట్ చేసిన‌ట్లు సీఎం వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా నిందితుల‌ను తీసుకు వెళుతున్న పోలీసు వాహ‌నాన్ని మ‌హిళ‌లు ఘెరావ్ చేశారు. పుల్కిత్ ఆర్య ఉత్త‌రాఖండ్ మాజీ మంత్రి , బీజేపీ నాయ‌కుడు వినోద్ ఆర్య కుమారుడు కావ‌డం విశేషం.

Also Read : తొక్కిస‌లాట‌కు మేం కార‌ణం కాదు – అజారుద్దీన్

Leave A Reply

Your Email Id will not be published!